xiaomi yu7: ఈ కారు 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్లు!

xiaomi yu7 launched

Share this article

xiaomi yu7: చైనా టెక్ దిగ్గజం షియోమి(XIOMI) తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV YU7 ను లాంచ్ చేసి, ప్రపంచ EV మార్కెట్‌ను ఒక్కసారిగా కదిలించేసింది. గడచిన జూలై 5న విడుదలైన ఈ వాహనానికి కేవలం 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్లు నమోదవ్వడం విశేషం. మొదటి గంటలో మొత్తం 3 లక్షల యూనిట్లు బుక్ అయ్యాయి.

ఇది ఒక్క చైనాలోనే కాదు, ప్ర‌పంచ‌మొత్తంగా ఇదే అతిపెద్ద రికార్డుగా నిలిచింది. షియోమి సంస్థ టెస్లా మోడల్ Y కి పోటీగా రూపొందించిన ఈ కారు, తన ఫీచర్లు, ధర, డిజైన్, రేంజ్ ద్వారా ఇప్పుడే వాహన ప్రియుల గుండెల్లో చోటు దక్కించుకుంది.

YU7 లో అద్భుత ఫీచర్లు.. టెక్నాలజీ, లగ్జరీకి నూతన నిర్వచనంగా మార‌నుంది. దాదాపు అన్నీ టాప్ ల‌క్ష‌ణాలే ఉన్న ఈ కారు..

రేంజ్: ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 835 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు (CLTC ప్రమాణాల ప్రకారం). ఇది ప్రపంచంలోనే అత్యధిక మైలేజ్ అందించే SUVలలో ఒకటి.

ఛార్జింగ్ సామర్థ్యం: 800V ఆర్కిటెక్చర్‌తో కేవలం 12 నిమిషాల్లో 10% నుంచి 80% ఛార్జ్ అవుతుంది. అంతే కాదు, 15 నిమిషాల్లో 620 కిమీ రేంజ్ అందించగలదు. ఇది డైలీ కమ్యూటింగ్‌కి మాత్రమే కాదు, లాంగ్ డ్రైవ్స్‌కి సైతం అద్భుతంగా ఉపయోగపడుతుంది.

వేగం & పనితీరు: YU7 Max వేరియంట్‌లో 690 HP పవర్, 0 నుంచి 100 కిమీ వేగం కేవలం 3.23 సెకన్లలో చేరుతుంది. గరిష్ఠ వేగం 253 కిమీ/గం.

డిజైన్: డిజైన్ విషయానికి వస్తే, 5 మీటర్ల పొడవు, స్పోర్టీ లుక్, ప్రత్యేక రంగులైన ఎమరాల్డ్ గ్రీన్, టైటానియం సిల్వర్, లావా ఆరెంజ్ కలరులు ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

xiaomi yu7

టెక్నాలజీ ఫీచర్లు
1.1 మీటర్ల హైపర్ విజన్ మినీ LED స్క్రీన్
నప్పా లెదర్ సీట్లు
LiDAR ఆధారిత స్వయంప్రతిపత్త డ్రైవింగ్ సిస్టమ్
పవర్‌ఫుల్ ఇంటెలిజెంట్ OS

స్టోరేజ్: వెంటిలేటెడ్ 678 లీటర్ల రియర్ కార్గో, 1,758 లీటర్ల వరకు విస్తరణ, 141 లీటర్ల ఫ్రంట్ ట్రంక్ (Frunk).

ధరలు:
YU7 స్టాండర్డ్ మోడల్ ధర 253,500 యువాన్ (సుమారు ₹29 లక్షలు)
YU7 Max వేరియంట్ ధర 329,900 యువాన్ (సుమారు ₹38 లక్షలు)

ఇండియా మార్కెట్ పై ప్రభావం?
ఇండియాలో ఇప్పటికే టాటా, మహీంద్రా, హ్యూండాయ్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల పోటీ పందెంలో ఉన్న వేళ షియోమి YU7 లాంటి మోడల్స్ ద్వారా చైనా కంపెనీలు కూడా అటెన్షన్ పొందుతున్నాయి. భారత మార్కెట్‌కి ఇంకా అధికారిక లాంచ్ డేట్ ప్రకటించలేదైనా, షియోమి మొబైల్స్‌కు ఉన్న భారీ ఫాలోయింగ్‌ని బట్టి ఈ కారు భారత్‌లోకి వస్తే ప్రీమియం EV మార్కెట్‌ను భారీగా ప్రభావితం చేసే అవకాశముంది.

అంత‌ర్జాతీయ ప్ర‌భావం..
టెస్లా, బీవైడి (BYD), మర్సిడెస్, BMW వంటి బ్రాండ్లకు పోటీగా, షియోమి తన మొట్టమొదటి కారుతోనే ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో గట్టి స్థానం సంపాదించగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కేవలం మొబైల్ కంపెనీగా మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా షియోమి తన పట్టు చూపించింది.

డెలివరీలు ఎప్పుడు?
చైనాలో జూలై 2025 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇతర దేశాల్లో కూడా స్టెప్ బై స్టెప్ ప్రవేశించేందుకు షియోమి వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

xiaomi yu7

షియోమి YU7 అనేది కేవలం మరో ఎలక్ట్రిక్ SUV కాదు – ఇది EV రంగంలో ఒక పెద్ద మార్పు సూచన. టెక్నాలజీ, వేగం, సౌకర్యం, ధర – అన్నింటిలోనూ సంతృప్తి కలిగించేలా రూపొందించబడిన ఈ కారు కోసం అంత‌ర్జాతీయంగా EV ప్రియులు కచ్చితంగా ఎదురుచూస్తున్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *