ఒకప్పుడు ఉద్యోగం అంటే ఆఫీసుకు వెళ్లాలి, టైమ్ బై టైమ్ పని చేయాలి అన్న మాట. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డిజిటల్ స్కిల్స్ ఉన్నవారికి ఇంట్లో కూర్చుని రూ.లక్షలు వెనకేసుకునే దారులు బోలెడు ఇప్పుడు. మీరు ఇంటర్, డిగ్రీ చదువుతున్నా.. లేదా ఇప్పటికే పూర్తయి ఇంట్లో ఉన్నా ఈ కోర్సులు నేర్చుకుంటే ఇంటి నుంచే ఉద్యోగం చేయొచ్చు.
కరోనా మహమ్మారి ఓవైపు, మారుతున్న సాంకేతికతలు మరోవైపు కలిసి రిమోట్ వర్క్, ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైమ్ అవకాశాలను ఇప్పుడు పెంచేశాయి. ఏళ్లుగా అమెరికా లాంటి అగ్రరాజ్యాలు చేస్తున్న పనిలాగే ఇప్పుడు మన దగ్గర కూడా ఎన్నో స్టార్టప్స్, ఐటీ కంపెనీలు, యూట్యూబ్ ఛానెల్స్, డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు ప్రాజెక్ట్ బేస్డ్ పనులను హైర్ చేస్తున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే — కొన్ని ఈజీ కోర్సులు నేర్చుకుంటే చాలు.. బేసిక్ ₹25,000 నుంచి ₹1.5 లక్షల వరకు సంపాదించొచ్చు. అందులో ఈ టాప్ 5 కోర్సుల ప్రస్తుత మార్కెట్ పరిస్థితపై కథనం మీకోసం..

🌟 1️⃣ డిజిటల్ మార్కెటింగ్ — హాట్ కెరీర్
నేడు ఏ బ్రాండ్‌కైనా ఆన్‌లైన్‌లో కనిపిస్తేనే వ్యాపారం. అందుకే డిజిటల్ మార్కెటింగ్‌కు విపరీతమైన డిమాండ్.
మీరు నేర్చుకోవాల్సింది
✅ SEO (Googleలో టాప్‌లోకి ఆ వ్యాపార వెబ్‌సైట్ ఎలా తేవాలి)
✅ Google Ads
✅ Social Media Marketing
✅ Email Marketing
✅ Analytics Tools
ఉద్యోగాలు:
👉 SEO Analyst
👉 Social Media Manager
👉 Digital Ads Specialist
జీతం:
✅ ఫ్రెషర్స్: ₹20,000 – ₹35,000 నెలకు
✅ అనుభవం ఉన్నవారికి: ₹50,000 – ₹1.20 లక్షల వరకు
✅ ఫ్రీలాన్స్: ఒక్క ప్రాజెక్ట్‌కు ₹5,000 – ₹50,000
మార్కెట్ పరిస్థితి: ప్రతి చిన్న బిజినెస్ నుండి MNC వరకు డిజిటల్ యాడ్స్ పెట్టడంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రంగం 30% వృద్ధిని చూస్తోంది.
🌟 2️⃣ వెబ్ డెవలప్‌మెంట్ — ఎవర్ గ్రీన్ డిమాండ్
ప్రతి కంపెనీకి ఒక వెబ్‌సైట్ అవసరమే. అందుకే వెబ్ డెవలపర్లకు గ్లోబల్‌గా మంచి డిమాండ్ ఉంది.
మీరు నేర్చుకోవాల్సింది:
✅ HTML, CSS, JavaScript
✅ WordPress
✅ React, NodeJS (అడ్వాన్స్‌డ్)
ఉద్యోగాలు:
👉 Front-End / Back-End Developer
👉 WordPress Website Creator
👉 Freelance Developer
జీతం:
✅ ఫ్రెషర్స్: ₹25,000 – ₹40,000
✅ అనుభవం: ₹60,000 – ₹1.5 లక్షల వరకు
✅ ప్రాజెక్ట్ బేస్డ్: ₹10,000 – ₹1 లక్ష వరకు
మార్కెట్:
ఈ-కామర్స్, స్టార్టప్స్, విదేశీ క్లయింట్ల నుంచి మంచి అవకాశాలు.
🌟 3️⃣ కంటెంట్ రైటింగ్ & కాపీరైటింగ్ — ప్యాషన్‌తో కెరీర్
Content is King! అనేది నిజమే. అన్ని కంపెనీలు, వెబ్‌సైట్‌లు, యూట్యూబ్, సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను వెల్-పెయిడ్‌గా కొనుగోలు చేస్తున్నాయి.
మీరు నేర్చుకోవాల్సింది:
✅ SEO Writing
✅ Blogging
✅ Copywriting
✅ Product Descriptions
✅ Grammarly, SurferSEO వంటి టూల్స్
ఉద్యోగాలు:
👉 Content Writer
👉 SEO Blogger
👉 Freelance Article Writer
జీతం:
✅ ఫ్రెషర్స్: ₹15,000 – ₹30,000
✅ అనుభవం: ₹40,000 – ₹80,000
✅ ఒక్క ఆర్టికల్‌కి ₹500 – ₹5,000 (ఫ్రీలాన్స్)
మార్కెట్:
ప్రతి బ్రాండ్‌కు కంటెంట్ అవసరం. మంచి రచన ఉంటే మీరు ఇంట్లో నుంచే పనులు పొందవచ్చు.
🌟 4️⃣ గ్రాఫిక్ డిజైనింగ్ — క్రియేటివ్ దారిలో సంపాదించండి
బ్రాండింగ్ అంటే డిజైన్. మంచి డిజైనింగ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్‌సైట్‌లు అన్నీ మీ సేవల్ని వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మీరు నేర్చుకోవాల్సింది:
✅ Adobe Photoshop, Illustrator
✅ Canva, Figma
✅ Logo Design, Social Media Templates
ఉద్యోగాలు:
👉 Graphic Designer
👉 UI/UX Designer
👉 Freelance Poster Creator
జీతం:
✅ ఫ్రెషర్స్: ₹20,000 – ₹35,000
✅ అనుభవం: ₹50,000 – ₹1.2 లక్షల వరకు
✅ ప్రాజెక్ట్: ₹500 – ₹10,000 వరకు
మార్కెట్:
Social Media Marketing బూమ్ వల్ల డిజైనింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది.
🌟 5️⃣ డేటా అనలిటిక్స్ — డేటా మన నూతన ఆయుధం
డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకునే కంపెనీలు ఎక్కువయ్యాయి. అందుకే డేటా అనలిస్టులకు మంచి ఫ్యూచర్ ఉంది.
మీరు నేర్చుకోవాల్సింది:
✅ Excel, Google Sheets
✅ SQL, Power BI, Tableau
✅ Basic Python (ఐచ్చికం)
ఉద్యోగాలు:
👉 Junior Data Analyst
👉 MIS Executive
👉 Business Intelligence Analyst
జీతం:
✅ ఫ్రెషర్స్: ₹25,000 – ₹40,000
✅ అనుభవం: ₹60,000 – ₹1.5 లక్షల వరకు
✅ ప్రాజెక్ట్: ₹1,000 – ₹15,000 (per project/report)
మార్కెట్:
ఫైనాన్స్, ఈ-కామర్స్, హెల్త్‌టెక్ కంపెనీలు డేటా నిపుణులను అధికంగా కోరుకుంటున్నాయి.
సరిగ్గా నెల రోజుల ఈ కోర్సులు నేర్చుకునేందుకు కేటాయిస్తే.. ఆన్‌లైన్‌లో వేల అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఎలాంటి విద్యార్హతలు వీటికి అవసరం లేదు. మంచి కోర్సు నేర్చుకుని.. రోజుకు కనీసం రెండు గంటలు ప్రాక్టీస్ చేయడం ద్వారా వీటిలో నైపుణ్యం పొందవచ్చు. తొలి మూడు నెలల్లోనే మీరు మొదటి సంపాదన చూడవచ్చు.
📌 ఎక్కడ నేర్చుకోవచ్చు? (Trusted Platforms)
🎓 Coursera.org
🎓 Udemy.com
🎓 freeCodeCamp.org
🎓 Google Digital Garage