Wanaparthy : గ్రామీణ విద్యలో కొత్త శకం: విద్యాశాఖపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవ

Share this article

Wanaparthy : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల విద్యా ప్రమాణాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యెక ధృష్టి సారించడంతో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సైతం విద్యాశాఖ పై ప్రత్యెక ధృష్టిని పెడుతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే అయా సబ్జెక్టులపై పట్టు సాధించి భయం వదిలేస్తే ఇక జీవితంలో వెనుకంజ వేయరనే విషయాన్ని గ్రహించి ప్రాథమిక పాటశాల స్థాయిలోనే విద్యా సామర్థ్యాలు పెంచేందుకు సబ్జెక్టు పై అవగాహన పెంచి భయాన్ని పోగొట్టేందుకు ఆధునిక పద్దతుల్లో డిజిటల్ విద్యను బోధిస్తున్నారు. దీనికితోడు ప్రస్తుతం తెలంగాణాలోని ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యెక గుర్తింపు సంఖ్య పెన్ (PEN) పర్మేనేంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ను కేటాయించడం గమనార్హం.


ముందుగా పాటశాలలో 3వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులలో ఎవరైతే విద్యలో వెనుకబడి ఉన్నారో అలాంటివారిని గుర్తించి వారికి కంప్యుటర్ ద్వారా ఆర్టిఫిషియల్ (AI) విద్యను అందిస్తున్నారు. ఇందులో భాషా సబ్జెక్టులతో పాటు లెక్కల సబ్జెక్టు బోధించడం జరుగుతుంది. కంప్యూటర్ ముందు కూర్చునే విద్యార్థి ఏ విద్యార్థికి ఆ విద్యార్ధి తన పెన్ నెంబరుతో లాగిన్ అయి సబ్జెక్టు ఎంపిక చేసుకుంటే కంపూటర్ విద్యా బోధనా ప్రారంభిస్తుంది. ముందుగ కంప్యూటర్ ఒక ప్రశ్నను సందిస్తుంది అది విద్యార్థి పరిష్కరిస్తే ముందుకు వెళ్లి మరో ప్రశ్నను సందిస్తుంది. ఒకవేళ ప్రషకు సమాధానం తప్పు చెప్పిన, లేదా విద్యార్థి చేయలేకపోయినా కంప్యూటర్ విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఇంకా చిన్న ప్రశ్న సందిస్తుంది విద్యార్థికి సులువుగా అర్థమయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో ఆటోమేటిక్ గా తదుపరి క్లాస్ కు నిక్షిప్తం చేసుకుంటుంది. తదుపరి క్లాస్ లో అక్కడి నుండి ప్రారంభిస్తుంది. దీనిద్వారా విద్యార్థికి సులువుగా అర్థం కావడమే కాకుండా విద్య పట్ల కంప్యూటర్ పరిజ్ఞానం పట్ల మంచి పట్టు సాధిస్తారు.

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చొరవతో వనపర్తి జిల్లాలోని ప్రాథమిక ఉన్నత పాటశాలలు, ప్రాథమిక పాటశాలలు ఒకే చోట ఉన్న 23 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక మౌలిక సదుపాయాలతో కంప్యూటర్ ఆధారిత తరగతులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని మూడో తరగతి నుంచి 5 తరగతి వరకు చదువుతున్న 471 మంది విద్యార్థులు ఆర్టిఫిషియల్ విద్యను రోజుకు 30 నిమిషాల పాటు ప్రత్యెక తరగతి ద్వారా నేర్చుకుంటున్నారు.
దీని వల్ల విద్యార్థులు తక్కువ సమయంలోనే పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. వారు క్లాస్‌రూమ్ లో మనోధైర్యంతో పాల్గొంటున్నారు. ముఖ్యంగా తనపట్ల తనకు నమ్మకాన్ని పెంపొందించుకొని చదువు పట్ల భయాన్ని దూరం చేసుకుంటున్నారు.ఈ వినూత్న కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వానికి విద్యా రంగంపై ఉన్న నిబద్ధతకు, ప్రత్యేక దృష్టికి ఉదాహరణగా నిలుస్తోంది.

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవ
ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల అమలులో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విశేష పాత్ర పోషిస్తున్నారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రాథమిక పాటశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు కంప్యూటర్ శిక్షణ అందించి విద్యార్థులకు ప్రతిరోజూ ఎ.ఐ. విద్యా బోధన జరిగే విధంగా క్రమం తప్పకుండ పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా విద్యాధికారి, మండల విద్యా అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 23 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇంటర్నెట్, విద్యార్థులకు హెడ్ సెట్ ఇతర మౌలిక సదుపాయాల్నిఅందజేసి ప్రోత్సహిస్తున్నారు.

తల్లిదండ్రుల స్పందన
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ప్రగతిని గమనించిన తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా చదవడంలో వెనుకబడిన తమ పిల్లలు ఇప్పుడు పాఠశాలలో ఆసక్తితో పాల్గొంటున్నారని చెబుతున్నారు. కంప్యూటర్ విద్య నేర్పిస్తుండటంతో గ్రామంలో ఇప్పటిదాక తమ పిల్లలను ప్రైవేట్ పాతశాలలకు పంపిస్తున్న వారు ఇప్పుడు ప్రభుత్వ పాతశాలకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *