విజ‌య్ సేతుప‌తి ఏస్ మూవీ చూశారా..?

Vijay Sethupathi ACE Movie Review

Share this article

ACE Movie Review: విజ‌య్ సేతుప‌తి(Vijay Sethupathi) వైవిధ్య‌మైన న‌టుడు. ఆ న‌ట‌నే సొంతగ‌డ్డ త‌మిళంలో ఉన్నంత మందే అభిమానుల్ని తెలుగులోనూ తెచ్చిపెట్టింది. ఈ మధ్య కాలంలో వ‌చ్చిన‌ సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్‌గానూ ఫ్యాన్ బేస్ క్రియేటైంది. విజ‌య్ సేతుప‌తి సినిమా అంటే సోష‌ల్ మీడియాలో హ‌డావుడి మామూలుగా ఉండ‌దు.. కానీ, ఏ ఆర్భాటం, ప్ర‌చారం లేకుండానే ఓ సినిమా శుక్ర‌వారం తెరమీద‌కి వ‌చ్చేసింది. అలా వ‌చ్చిన ‘ఏస్‌’ సినిమా ఎంత ప్ర‌భావం చూపింది.. అస‌లు క‌థేంటో ఈ రివ్యూలో తెలుసుకోండి..

క‌థేంటంటే..?
జైలు నుంచి విడుద‌లై గ‌తాన్నంతా మ‌రిచిపోయి.. ఓ కొత్త జీవితం మొద‌లుపెట్టేందుకు మ‌లేషియా వెళ్తాడు బోల్ట్ కాశీ(విజ‌య్ సేతుప‌తి). అక్క‌డ జ్ఞానానందం (యోగి బాబు) (Comedian Yogi Babu) ద‌గ్గ‌ర ఆశ్ర‌యం పొందుతాడు. అత‌ని సాయంతోనే క‌ల్ప‌న (దివ్యా పిళ్లై) న‌డిపే ఓ హోట‌ల్లో వంట‌వాడిగా చేర‌తాడు. అదే స‌మయంలో రుక్మిణి(రుఖ్మిణీ వ‌సంత్‌ Rukmini Vasanth)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. హోట‌ల్ న‌డిపేందుకు ఆర్థిక ఇబ్బందులు ప‌డుతూ ఉంటుంది క‌ల్ప‌న‌. అదే స‌మ‌యంలో త‌న పెంపుడు తండ్రి ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న ఇంటిని విడిపించుకునేందుకు డ‌బ్బు కూడ‌బెడుతుంటుంది రుక్మిణి. ఈ ఇద్ద‌రినీ కాపాడేందుకు మ‌లేషియా(Malaysia)లో స్మ‌గ్లింగ్(Smuggling) త‌దిత‌ర బ్లాక్ బిజినెస్ చేసే ధ‌ర్మ ద‌గ్గ‌ర అప్పు తీసుకుంటారు. ఆ త‌ర్వాత అప్పు క‌ట్ట‌లేక ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. అయితే ఈ చిక్కుల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు..? కాశీ గ‌తం ఏంటి..? ఎందుకు జైలుకెళ్లాడు..? బ‌య‌ట ప‌డేందుకు గ‌తం ఎలా ఉప‌యోగ‌ప‌డింది..? అనేవి తెలుసుకోవాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే.

ఎలా ఉంది..?
దాదాపు గ‌తంలో చూసిన సినిమాల మాదిరే అనిపిస్తుంది ద‌ర్శ‌కుడు అరుముగ కుమార్ రాసిన క‌థ‌. కానీ, దాన్ని ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్ద‌డంలో డైరెక్ట‌ర్ స‌ఫ‌ల‌మ‌య్యాడు. సినిమా ఎండింగ్ వ‌ర‌కూ ట్విస్టులేం లేక‌పోయినా.. ఎప్ప‌టిలాగే యోగిబాబు టైమింగ్, విజ‌య్ సేతుప‌తి డార్క్ కామెడీతో పాటు హీరోయిన్ రుక్మిణీ స్క్రీన్ ప్రెజెన్స్ సీట్లో కూర్చోబెడుతుంది. ఫస్ట్ ఆఫ్ అంతా క‌థేం క‌నిపించ‌దు.. ఇంట‌ర్వెల్ త‌ర్వాత విల‌న్ ఎంట‌ర‌య్యాకే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. కొన్ని కామెడీ, యాక్ష‌న్ సీన్లు ఆక‌ట్టుకుంటాయి. దీంతో పాటు ఎండింగ్ ట్విస్ట్ కొస‌మెరుపు. అదే సినిమా థియేట‌ర్(Cinema Theatre) నుంచి ఓ మాంచి ఫీల్‌తో బ‌య‌ట‌కి పంపిస్తుంది. పాట‌లు బాగున్నాయి.

ఓజీ రేటింగ్‌: 3/5

New Movie : ACE Movie Review

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *