
Hyderabad: ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్(Dragon) మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైందంటూ అప్పుడప్పుడూ లీక్ అవుతున్న చిత్రాలు సినిమా మీద అంచనాలు పెంచుతుండగా.. ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
డర్టీ పిక్చర్(Durty Picture) సినిమాతో దేశవ్యాప్తంగా సినిమాలు తెలియని వారికి కూడా పరిచయమైంది విద్యా బాలన్. ఆ తర్వాతా కథా నేపథ్యమున్న ఎన్నో చిత్రాలతో తనేంటో చూపించింది. ఇప్పుడు డ్రాగన్ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో విద్య కనిపించనుందనే వార్తలు వెలువడుతున్నాయి. కేజీఎఫ్-2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వచ్చే సంవత్సంర జూన్ 25న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.