America: అమెరికాలో భారతీయ విద్యార్థులపై అన్యాయాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నెవార్క్ ఎయిర్‌పోర్టులో ఓ భారతీయ విద్యార్థికి బేడీలు వేసి, నేలపై పడేసి కాలితో తొక్కిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యాభ్యాసంపై కలలతో అమెరికా గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడికి ఎదురైన అవమానకర పరిస్థితి చూసిన నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ వీడియోను కునాల్ జైన్ అనే ఎన్నారై వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో హరియాణా స్థానిక భాషలో మాట్లాడుతున్నట్టు కనిపించిన విద్యార్థిని అమెరికా భద్రతా సిబ్బంది మతి భ్రమితుడిగా చూపించే ప్రయత్నం చేశారని, అతడి ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకుని నిర్భందించారని ఆరోపించారు. విద్యార్థి పలుమార్లు “నేను మానసికంగా బాగోలేను” అని చెప్పే ప్రయత్నం చేసినా.. అధికారులు ఎలాంటి కనికరం చూపించలేదని కునాల్ వేదన వ్యక్తం చేశారు. చివరికి అతడిని బలవంతంగా డిపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది.
అమెరికా వార్నింగ్!
ఈ వీడియోపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో, భారతదేశంలోని అమెరికా ఎంబసీ స్పందించింది. అమెరికాలో చట్టబద్ధంగా ప్రవేశించే వారిని ఎల్లప్పుడూ స్వాగతిస్తామని… వీసా దుర్వినియోగం, అక్రమంగా ప్రవేశించే వారిని మాత్రం ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించింది. “అమెరికా పర్యటన ఓ హక్కు కాదు. అది ఒక అవకాశం మాత్రమే. ఆ అవకాశం విలువను గుర్తించని వారిపై చర్యలు తప్పవు” అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఉన్నత కలలు.. ఉఫ్!
ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయన్నది నిజం. స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లే విద్యార్థులు ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే అధికారులు అనుమానంతో తక్షణమే విచారణ మొదలు పెట్టి, సమాధానాలు సరిగ్గా రాకపోతే డిపోర్ట్ చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి.
విద్యార్థి వీసాతో అమెరికాలో ఉదయాన్నే అడుగు పెట్టిన విద్యార్థులను సాయంత్రానికి తిరుగు విమానం ఎక్కించేస్తున్నారు” అని కునాల్ వేదనతో చెప్పారు.
వీడియోలో కనిపించిన విద్యార్థి పరిస్థితిపై భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు అండగా ఉండాల్సిన సమయం ఇదని పౌర సమాజం అభిప్రాయపడుతోంది.
లాస్ ఏంజెల్స్‌లో బిగ్గరించిన నిరసనలు
ఇక అమెరికాలో మరోవైపు వలస విధానాలపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన కఠినమైన వలస చట్టాలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెల్స్ నగరంలో వేలాదిమంది వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. నిరసనకారులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. అంతేకాకుండా కొన్ని చోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ అల్లర్ల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం 2 వేల మంది నేషనల్ గార్డులను రంగంలోకి దింపింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు కఠినంగా స్పందించారని, ఓ జర్నలిస్టు గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
Indian Student Arrested in USA, Newark Airport Indian Student Video, US Embassy India Statement, Visa Misuse, Deportation Incidents, LA Immigration Protests, National Guard Deployed USA, Student Visa Issues