Mumbai: మూత్రం తాగితే ముఖంపై ముడతలు పోయి.. యవ్వనంగా కనిపిస్తారని ఆషికీ(Ashiqi) హీరోయిన్ అను అగర్వాల్(Anu Agarwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరిన్(Urin) తాగడం యోగాలో ఒక ముద్ర అని చెప్పుకొచ్చారు. చాలా మందికి యూరిన్ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియదు. తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నారో… లేదంటే అవగాహన లేదో తెలియదు కాని యూరిన్ తాగడాన్ని ఆమ్రోలి అంటారని చెప్పుకొచ్చారు. ఇది యోగాలో ఒక ముద్ర కాగా, దానిని తాను ప్రాక్టీస్ చేశానని తెలిపారు. మనం యూరిన్ లో ఎంతో కొంత తిరిగి తీసుకుంటే మంచిదని.. ఇది యాంటీ ఏజింగ్ కోసం పనిచేస్తుందన్నారు అను. అది తనకు వ్యక్తిగతంగా చాలా ఉపయోగపడిందని చెప్పుకొచ్చారీ బాలీవుడ్ భామ.

అయితే వైద్యులు తాగొద్దంటున్నారు కదా అని ప్రశ్న రాగా.. సైన్స్ ఎప్పటిది? 200 ఏళ్ళు?? యోగా 1000 ఏళ్ల నుంచి ఉంది. మీరు రెండిటిలో దేనిని నమ్ముతారు అని తిరిగి ప్రశ్నించింది అను. అనుకి ముందు సీనియర్ నటుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫేమ్ పరేష్ రావల్(Paresh Rawal) సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తనకు మోకాలి గాయమైనప్పుడు మిత్రుల సలహాతో తన మూత్రం తానే తాగానని.. మందులు చేయలేని సాయం అది చేసిందని. చాలా తక్కువ సమయంలో గాయం నయం చేసేందుకు సాయపడిందని తెలిపారు పరేష్. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్(Ajay Devgan) తండ్రి, సీనియర్ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగణ్ సలహాతో తాను మూత్రం తాగినట్లు పరేష్ చెప్పగా నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.

దీనిపై పలువరు వైద్యులు సైతం స్పందిస్తూ.. మూత్రం మన శరీరంలోని మలినాల్ని తొలగిస్తుందని.. ఇందులో బ్యాక్టీరియాతో సహ ఒంట్లోని చెత్తంతా ఉంటుంది కాబట్టి కొత్త అనారోగ్య సమస్యల్ని సృష్టించిందని కొందరు వైద్యులు స్పందించారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.