Baba Vanga: జూలై 5నే భారీ విల‌యం.. జోస్యం నిజ‌మ‌వుతుందా..?

baba vanga prediction

Share this article

Baba Vanga: ప్రపంచాన్ని వణికించిన బల్గేరియన్ జోత్యిష్కురాలు బాబా వంగా పేరును ఎప్పటికీ మరిచిపోలేం. ఆమె చెప్పిన భవిష్యవాణులు, ఏదో విధంగా నిజమవుతూ వస్తుండటంతో.. ఆమెకు విశ్వాసుల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఇప్పుడు అదే దారిలో మరో జోత్యిష్కురాలు వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె పేరు రియో టాట్సుకి – జపాన్‌కు చెందిన ప్రముఖ మాంగా కళాకారిణి. గ‌తంలో ఆమె చెప్పిన అనేక జోస్యాలు ఫ‌లించ‌డంతో ఆమెను న్యూ బాబా వంగ చేసేశారు జ‌నాలు. అయితే, ఆమె చెప్పిన కొన్ని జోస్యాలు ఇప్పుడు ప్రపంచ‌ దేశాల్ని వ‌ణికిస్తున్నాయి.

జూలై 5న భారీ ముప్పు..!
టాట్సుకి తన పుస్తకం ‘The Future I Saw’ (నేను చూసిన భవిష్యత్తు) లో చేసిన ఓ జోస్యం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆమె చెప్పిన ప్రకారం, 2025 జూలై 5వ తేదీన జపాన్‌కు మరియు పరిసర ప్రాంతాలకు భారీ భూకంపం లేదా సునామీ ముప్పు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆమె విశ్లేషించిన‌ట్లు.. జపాన్ – ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్లు తాకినందున భూకంపం సంభవించవచ్చు. అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల సునామీ ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉండ‌వ‌చ్చు. తన కలలో సముద్ర గర్భం నుంచి గాలి బుడగలు బయటకు వస్తున్న దృశ్యాలు చూశానని ఆమె చెబుతున్నారు. ఇవి సగటు భూకంపాలకు ముందువచ్చే సంకేతాలుగా భావిస్తున్నారు.

✈️ జపాన్ టూరిజం రంగానికి గట్టి దెబ్బ
ఈ జోస్యంతో జపాన్ టూరిజం పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటోంది. ట్రావెల్ ఏజెన్సీల సమాచారం ప్రకారం, జూలైలో జపాన్ ప్రయాణాల బుకింగ్స్‌లో ఒక్కసారిగా 83% తగ్గుదల చోటుచేసుకుంది. చైనా, థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల నుంచి హోటల్ బుకింగ్స్ కూడా భారీగా తగ్గిపోయాయి. బోయింగ్ విమానాల్లో 15-20% వరకు రిజర్వేషన్లు రద్దయ్యాయి. Airline Japan సంస్థ ప్రకారం, మునుపు 80% సీట్లు భర్తీ అవుతాయని అంచనా వేయగా, ప్రస్తుతం కేవలం 40% మాత్రమే రిజర్వేషన్లు వచ్చాయని జెనరల్ మేనేజర్ హిరోకి ఇటో తెలిపారు. బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం, హాంగ్ కాంగ్ నుంచే వచ్చిన బుకింగ్స్‌లో 50% తగ్గుదల కనిపించింది. ఈ పరిస్థితి జపాన్ ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పుకార్లు న‌మ్మొద్దు..!
ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో, జపాన్ ప్రభుత్వం స్పందించింది. మియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ యోషిహిరో మురై మాట్లాడుతూ, “ఇవి నిరాధారమైన పుకార్లు. జపనీయులు తమ దేశం వదిలి పారిపోతే అన్నమాటే లేదు. ఎవరూ భయపడవద్దు. జపాన్ చాలా భద్రమైన దేశం. పర్యాటకులు ధైర్యంగా రావొచ్చు” అని పేర్కొన్నారు. పుకార్లు న‌మ్మొద్ద‌ని హిత‌వు ప‌లికారు.

🔮 గతంలో నిజమైన జోస్యాలు ఇవే..
రియో టాట్సుకి గతంలో చెప్పిన కొన్ని జోస్యాలు కూడా కలవరం కలిగించాయి… కానీ అవి నిజమయ్యాయి. వాటిలో:

2011 తోహోకు భూకంపం & సునామీ
ఫుకుషిమా అణు ప్రమాదం
యువరాణి డయానా మరణం
ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం

కొవిడ్-19 మహమ్మారి (2019).. ఇవ‌న్నీ ఇప్ప‌టికి ఆమె చెప్పిన ప్ర‌ధాన అంశాలు కాగా.. “2030లో కొవిడ్ మహమ్మారి తిరిగి వస్తుంది. ఈసారి ఇది గతం కంటే మరింత ప్రాణాంతకంగా ఉంటుంది” అని కూడా ఈ న్యూ బాబా వంగా హెచ్చరించారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *