మార్కెట్ అనిశ్చితికి గురవుతున్నా, చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టాలనుకునే యువ మరియు తొలి సారి పెట్టుబడిదారులకు కూడా తీపి కబురుంది. కేవలం రూ.100 కంటే తక్కువ ధరలో ట్రేడవుతున్న కొన్ని షేర్లు మార్కెట్లో మంచి ధర పలుకుతుండగా.. భవిష్యత్తులో గణనీయమైన వృద్ధి సాధించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. షేర్ మార్కట్లో దిగాలి అనుకున్నా.. పెట్టుబడి, నష్టాలకు భయపడి వెనకడుగు వేసే వారికి ఈ కథనం ఉపయోగపడొచ్చు.

ఈ ఆర్టికల్ లో ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్‌లో ఉన్న(ఈనెల నాలుగో తేదీ నాటికి), అద్భుత వృద్ధి అవకాశాలు కలిగిన టాప్ 5 షేర్ల గురించి తెలుసుకుందాం. ఇవి యువతకు తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాల కలయికతో మంచి ఎంట్రీ పాయింట్‌లు కావచ్చు.

1️⃣ IOB (Indian Overseas Bank) – ₹70 రేంజ్‌లో
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు.. ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహం, నాన్-పెర్ఫార్మింగ్ ఆస్తుల తగ్గుదల, డిజిటలైజేషన్ వృద్ధితో ఇది తిరిగి లాభదాయకత బాటలో ఉంది.
సబ్ ₹100 ధర – PSU బ్యాంక్ – ఫండమెంటల్స్ మెరుగవుతున్నాయి. యువతకు దీర్ఘకాలిక పెట్టుబడిగా మంచి ఎంపికగా మారుతుందని నిపుణుల అంచనా.
2️⃣ Ola Electric (IPO తర్వాత లిస్టింగ్ – ₹90–₹100 రేంజ్)
ఈవీ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఓలా ఎలక్ట్రిక్ తాజాగా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇది యువతకు సాంకేతికతతో కూడిన గ్రీన్ ఫ్యూచర్ అవకాశాన్ని కల్పిస్తున్న కంపెనీ.
ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ – బ్రాండ్ వెల్యూతో ఆదరణ
⚡️తక్కువ ధర – హై వాల్యూమ్ – స్పెక్యులేటివ్ కానీ హై రిటర్న్ పొటెన్షియల్ ఉందని నిపుణుల మాట.
3️⃣ TTML (Tata Teleservices Maharashtra Ltd) – ₹70–₹80 రేంజ్‌లో
టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ టెలికాం మరియు క్లౌడ్ కమ్యూనికేషన్ పరిష్కారాలను అందిస్తోంది. ఈ కంపెనీ భవిష్యత్తులో B2B టెక్ సేవలలో మరింత పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
టాటా సంస్థకు ఉన్న బ్రాండ్ నేమ్, పూర్తి సాంకేతికతపై ఆధారపడిన వ్యాపారంతో పాటు భవిష్యత్తులో మంచి వృద్ధి ఉంటుందనే అంచనా. కొంచెం రిస్క్ తో లాంగ్ టర్మ్ పెట్టుబడికి ఇది మంచి ఆలోచన అని నిపుణులు చెబుతున్నారు.
4️⃣ PSB (Punjab & Sind Bank) – ₹50–₹60 రేంజ్‌లో
ఇది మరో ప్రభుత్వ రంగ బ్యాంక్. NPA ల తగ్గుదల, ప్రభుత్వ క్యాపిటల్ ఇన్‌ఫ్యూషన్ తో స్టాక్ స్థిరత్వం సాధిస్తోంది. దీనికి పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్‌లో టర్న్ అరౌండ్ స్టోరీ ఉంది.
కొంచెం చిన్న పెట్టుబడితో బ్యాంకింగ్ సెగ్మెంట్‌ను టచ్ చేయాలంటే ఇది మంచి ఎంపిక.
5️⃣ Sigachi Industries – ₹80–₹90 రేంజ్‌లో
ఫార్మా మరియు ఫుడ్ సప్లిమెంట్స్ కోసం ఉపయోగించే మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్‌ను తయారుచేసే కంపెనీ. కొంతకాలంగా IPOలో మంచి లాభాలు ఇచ్చిన తర్వాత దీని ధర స్థిరంగా ఉంది.
ఫార్మా ఉత్పత్తుల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా ఉంది. ప్రస్తుత తరుణంలో ఫార్మా డిమాండ్ పెరుగుతోండటంతో ఇది మంచి అవకాశం అనే చెప్పొచ్చు. స్థిరమైన రంగం – యువతకు స్టేబుల్ & గో యాక్టివ్ స్టాక్.
🔍 యువతకు చిట్కాలు:
అధిక ఆశయాలు కాకుండా రిస్క్ బేరీజు చూసి పెట్టుబడి పెట్టండి
ఒకే స్టాక్‌లో మొత్తాన్ని పెట్టడం కన్నామంచి సంస్థల్లో కొంత కొంత పెట్టడం మంచిది.
స్టాప్ లాస్ పెట్టడం, మార్కెట్ ట్రెండ్స్ ట్రాక్ చేయడం అలవాటు చేసుకోండి
పెనీ స్టాక్స్ లో ఉన్నవన్నీ రిస్క్‌ఫ్రీ అనుకోవద్దు
✨ చిన్న పెట్టుబడితో పెద్ద ఆశలు..!
₹100 కంటే తక్కువ ధరలో ఉండే ఈ షేర్లు చిన్న పెట్టుబడిదారులకు మార్కెట్లోకి సులభంగా ప్రవేశించగల మంచి మార్గం. అయితే, ప్రతి షేర్‌కి రిస్క్ ఉంటుంది, కాబట్టి సరైన విశ్లేషణతో, స్టాప్ లాస్, డైవర్సిఫికేషన్ వంటి పద్ధతులను పాటిస్తూ ముందుకు వెళ్తే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆచితూచి అడుగేయండి.
stock market, shares, today trends, top 5 shares