TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టి, మైనార్టీ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతకుమారి పర్యటించారు. గోపులాపూర్, సిరికొండ గ్రామాల్లో బుధవారం జరిగిన ఈ పర్యటనలో ఆమె వెంట బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరికొండ గ్రామానికి చెందిన తూము లావణ్య, కుమార్‌ల ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం గోపులాపూర్ గ్రామానికి చెందిన గోవిందుల నాగభూషణం రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన విషయం తెలుసుకుని.. బాధితున్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి ఆర్థిక పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాండ్ర అశోక్ రావు, మాజీ సర్పంచ్ బల్మూరి రామారావు, గాలిపెల్లి రాయమల్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరిపెల్లి రవీందర్ రెడ్డి, బీర్పూర్ తిరుపతి, కుంట మహేష్, గైని శ్రీనివాస్, గజ్జెల విజయ్, నక్క సత్తయ్య, నంది తిరుపతి, బండారి మహేష్ తదితరులు పాల్గొన్నారు.