జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు.

రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెగింపే నేటి తెలంగాణను స్వరాష్ట్రంగా సగర్వంగా నిలబెట్టిందని బుగ్గారం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గాలిపెల్లి మహేష్ అన్నారు. బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం.. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు.. మండలవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకున్నామన్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయని వెల్లడించారు.
ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావుల సూచనలతో, అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. ఉద్యమానికి సరైన నాయకత్వంతో సకలజనులను నడిపించడంలో కేసీఆర్ సఫలమయ్యారన్నారు. దాని ఫలితమే నేటి ఈ బంగారు తెలంగాణ అని పేర్కొన్నారు. ఉద్యమ సాధన నుంచి స్వరాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపేదాకా ఆయనకున్న చిత్తశుద్ధి ఇంకే నాయకుడికీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని గాలిపెల్లి మహేష్ దుయ్యబట్టారు. బుగ్గారం మండల పరిధిలో అన్నీ గత బీఆర్ఎస్ హయాంలో జరిగినవేనని.. మండల కార్యాలయాలు సైతం బీఆర్ఎస్సే తీసుకొచ్చిందని.. ఇప్పుడున్న కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం మండల సీనియర్ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Telangana Formation Day, KCR, BRS Party, Jagital District