
తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణకు ముందు కాంగ్రెస్(Congress) హైకమాండ్ ఐదు కీలక కమిటీలను ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్ నేతృత్వంలో 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో కార్యక్రమ కమిటీ, ఆరుగురితో డిసిప్లీనరీ యాక్షన్ కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు జీవన్ రెడ్డి(Jeevan Reddy), హన్మంతరావు, అంజన్ కుమార్ యాదవ్ లకు సలహాదారుల కమిటీలో చోటు కల్పించింది.
రాజకీయ వ్యవహారాల కమిటీలో..
మీనాక్షీ నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు నేతలు చల్లా వంశీచంద్ రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, అజహరుద్దీన్, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఐలయ్య, పి సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, జెట్టి కుసుమ కుమార్, ఎరవర్తి అనిల్ కుమార్ ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రులకు చోటు కల్పించారు.

సలహాదారుల కమిటీ..
సలహాదారుల కమిటీలో మీనాక్షీ నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, వి హనుమంతరావు, టి జీవన్ రెడ్డి, జానారెడ్డి, కే కేశవరావు, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, గీతారెడ్డి, ఎం అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, జాఫర్ జావేద్, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్ లను ఎంపిక చేశారు.
డీలిమిటేషన్ కమిటీ
ఈ కమిటీకి ఛైర్మన్‌గా చల్లా వంశీచంద్ రెడ్డితో పాటు సభ్యులుగా గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, శ్రవణ్ కుమార్ రెడ్డి, పవన్ మల్లాది, వెంకట రమణ ఉన్నారు.
సంవిధాన్ బచావ్ ప్రోగ్రామ్ కమిటీ
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంవిధాన్ బచావ్ కమిటీ ఛైర్మన్‌గా పి వినయ్ కుమార్, సభ్యులుగా అద్దంకి దయాకర్, కె శంకరయ్య, బాలు నాయక్, ఆత్రం సుగుణ, ఎ నర్సి రెడ్డి, రాచమళ్ల సిద్ధేశ్వర్, సంతోష్ కొలకొండ, డాక్టర్ పులి అనిల్ కుమార్, జూలూరి ధనలక్ష్మి, మజీద్ ఖాన్, జి రాములు, అర్జున్ రావు, శౌరి, కొల్లం వల్లభ్ రెడ్డి, వి శ్రీకాంత్ రెడ్డిలకు చోటు కల్పించారు.
క్రమశిక్షణ చర్యల కమిటీ..
టీపీసీసీ డిసీప్లీనరీ యాక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మల్లు రవి, వైస్ ఛైర్మన్‌గా శ్యామ్ మోహన్, సభ్యులుగా ఎం నిరంజన్ రెడ్డి, బి కమలాకర్ రావు, జాఫర్ జావేద్, డాక్టర్ జీవీ రామకృష్ణలను ఎంపిక చేశారు.