
Hyderabad: తెలగాణ సర్కారుపై సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూములపై విచారణ జరిపిన సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ చెట్ల నరికివేతపై మండిపడింది. ఈ సంఘటనను సమర్థించుకోవద్దని సర్కారుకు తెలిపింది. ఇన్ని చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించడంతో పాటు ఆ స్థలంలో చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామంది. డజన్ల కొద్దీ బుల్డోజర్లు తెచ్చినట్లు సాక్షులు చెబుతున్నారు.. వారాంతంలో ఈ చెట్లు నరికే పని చేయడమెందుకు అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పిన సుప్రీం ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది.