అంతర్జాతీయ పరిస్థితులు, భారతీయ జీడీపీ గణాంకాల ప్రకటనల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు(Stock Markets) శుక్రవారం మధ్యాహ్నం నాటికి నష్టాల్లో ముగిశాయి. టారిఫ్(Tariffs)ల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుకుతనంతో పాటు శుక్రవారం సాయంత్రం వరకు కేంద్ర సర్కారు జీడీపీ వివరాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నారు. దీంతో సెన్సెక్స్(Sensex) 228 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 65 పాయింట్లు పడిపోయాయి. ఆటోమొబైల్, మెటల్, ఐటీ రంగాల్లో షేర్ల విక్రయాలు శుక్రవారం ఉదయం గణనీయంగా పెరగడంతో మార్కెట్ సూచీలు పడిపోయాయి.
📉 మార్కెట్ నష్టాలకు కారణాలు..
టారిఫ్ దెబ్బ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విధించిన విదేశీ దిగుమతులపై పన్నులను అక్కడి ఫెడరల్ అప్పీల్ కోర్టు శుక్రవారం తాత్కాలికంగా పునరుద్ధరించింది. దీంతో అమెరికా ఆధాయంపై ఆధారపడే భారత సంస్థలన్నీ నష్టాల్లోకి వెళ్లాయి.

జీడీపీ ప్రభావం..
శుక్రవారం సాయంత్రానికి భారత కేంద్ర ప్రభుత్వం దేశీయ జీడీపీ గణాంకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇది మార్కెట్‌పై కీలకంగా ప్రభావితం చూపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శుక్రవారం మధ్యాహ్నానికి సెన్సెక్స్ 228.39 పాయింట్లు (0.28%) తగ్గి 81,404.63 వద్ద ముగిసింది, నిఫ్టీ 65.35 పాయింట్లు (0.26%) తగ్గి 24,768.25 వద్ద స్థిరపడింది.
📊 ప్రధాన నష్టాల్లో షేర్లు:
షేర్ మార్కెట్‌లో ప్రధాన సంస్థలైన బజాజ్ ఆటో.. 2.3% నష్టాన్ని చవిచూడగా.. హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, మహీంద్రా & మహీంద్రా గ్రూప్‌లు సుమారు 3% వరకు నష్టపోయాయి.
📈 వీటికి స్వల్ప లాభాలు..
మార్కెట్ హెచ్చుతగ్గుల్లోనూ కొన్ని షేర్లు లాభాల బాటపట్టాయి. వాటిలో బజాజ్ ఫిన్‌సర్వ్, కోల్ ఇండియా, ఎల్ & టి, అపోలో హాస్పిటల్స్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ తదితర షేర్లు సుమారు 0.5% వరకు లాభపడ్డాయి.
🌐అంతర్జాతీయంగానే అదే ప్రభావం:
అంతర్జాతీయ మార్కెట్ కూడా శుక్రవారం నష్టాల్లోనే కొనసాగుతోంది. మార్కెట్‌లో అస్థిరతతో పలు కీలక మార్కెట్లు పడిపోయాయి. జపాన్ నిక్కీ 225, దక్షిణ కొరియా కోస్పి, షాంఘై కాంపోజిట్, హాంగ్‌కాంగ్ హాంగ్‌సేంగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చరిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలు, నష్టాలు మార్కెట్ పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. పూర్తిగా తెలియకుండా, విశ్లేషించకుండా పెట్టుబడులు నష్టాలకు కారణమవ్వొచ్చు. జాగ్రత్త!
Disclaimer: Investment in securities are subject to market risks, please carry out your due diligence before investing. And last but not least, past performance is not indicative of future returns.