SSC CGL 2025: భారీ నోటిఫికేష‌న్‌.. డిగ్రీ ఉంటే చాలు.. ఇలా అప్లై చేయండి!

SSC CGL 2025 Notification

Share this article

SSC CGL 2025 Notification: భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడే అభ్యర్థులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేష‌న్ రానే వ‌చ్చింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్ష 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, మరియు సంస్థలలోని గ్రూప్ ‘B’ మరియు గ్రూప్ ‘C’ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ సారి SSC CGL నోటిఫికేషన్ ద్వారా అంచనా వేసిన ఖాళీల సంఖ్య 14,582. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టులు – ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/NIA), డివిజనల్ అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ మొదలైనవి ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు ప్రతీ సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు క్షుణ్నంగా ఈ క‌థ‌నంలో.

ఈ పరీక్ష ద్వారా ఎంపికయ్యే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం మంచి జీతాలు, స్థిరమైన భవిష్యత్తు, పదోన్నతుల అవకాశాలు కల్పిస్తుంది. అదే సమయంలో సామాజిక గౌరవం, వైద్య సేవలు, పెన్షన్ లాంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అందుకే SSC CGL పరీక్ష భారతదేశంలోని యువతలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పోటీ పరీక్షలలో ఒకటి.

🗓 ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 09 జూన్ 2025

దరఖాస్తుకు చివరి తేదీ: 04 జూలై 2025 (రాత్రి 11:00 గంటల వరకు)

ఫీజు చెల్లింపు గడువు: 05 జూలై 2025

దరఖాస్తు సవరణల విండో: 09 జూలై – 11 జూలై 2025

టియర్-I పరీక్ష తేదీలు: 13 ఆగస్టు – 30 ఆగస్టు 2025

టియర్-II పరీక్ష: డిసెంబర్ 2025లో జరగనుంది

భర్తీ చేయనున్న పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంఘ సంస్ధల్లో గ్రూప్ B & C పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో కొన్ని ముఖ్యమైన పోస్టులు ఇవే:

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (Central Secretariat, Railways, IB, MEA, etc.)

ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI, NIA)

డివిజనల్ అకౌంటెంట్ (C&AG)

స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్

ట్యాక్స్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, UDC లాంటి క్లరికల్ పోస్టులు

🎓 అర్హతలు:
మినిమం అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ.

JSO పోస్టులకు: ఇంటర్‌లో మ్యాథ్స్‌లో కనీసం 60% మార్కులు ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి.

Final year విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు, కానీ 01-08-2025 నాటికి డిగ్రీ పూర్తి అయి ఉండాలి.

🔞 వయస్సు పరిమితి:
18 – 32 సంవత్సరాల మధ్య (పోస్ట్ ఆధారంగా).

రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.

💵 దరఖాస్తు ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: ₹100

SC/ST, మహిళలు, PwBD, మాజీ సైనికులకు: ఫీజు మినహాయింపు

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: BHIM UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా

🖥 దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in

లేదా mySSC మొబైల్ యాప్ ద్వారా

Aadhaar ఆధారిత ఆధారంతో దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు ఉన్నాయి

అప్లికేషన్‌లో ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ అవసరం ఉంటుంది

📝 ఎంపిక ప్రక్రియ:
ట‌యర్-I: ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో (1hr duration)

ట‌యర్-II: విభాగాల వారీగా పరీక్షలు, కంప్యూటర్ నైపుణ్యం, డేటా ఎంట్రీ టెస్ట్

కొన్ని పోస్టులకు ప్రత్యేకమైన ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ టెస్టులు ఉండే అవకాశం ఉంది

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ స్టెప్ బై స్టెప్‌..

అభ్యర్థులు https://ssc.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. SSC కొత్త వెబ్‌సైట్‌కు మారిన నేపథ్యంలో పాత వెబ్‌సైట్ (ssc.nic.in) ద్వారా దరఖాస్తు చేయలేరు. కాబట్టి, కొత్త విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుని అప్లై చేయడం ముఖ్యం.

దశ 1: వ‌న్‌టైమ్ రిజిస్ట్రేషన్ (One-Time Registration – OTR)
అధికారిక SSC వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://ssc.gov.in

“Register Now” లేదా “One-Time Registration” అనే ఎంపికపై క్లిక్ చేయండి

అభ్య‌ర్థుల‌ పూర్తి వివరాలు నమోదు చేయాలి:

పేరు (ఎస్ఎస్సీ మెమో ప్రకారం), పుట్టిన తేది, లింగం, ఆధార్ నంబర్ లేదా ఇతర గుర్తింపు వివరాలు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, నివాస చిరునామా, స్థిర చిరునామా న‌మోదు చేయాలి.

మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ద్వారా వ‌చ్చే OTP ధ్రువీక‌రించాలి. లాగిన్ కోసం యూజర్ నేమ్, పాస్వర్డ్ రూపొందించాలి.

📝 గమనిక: ఆధార్ ఆధారిత ఫోటో క్యాప్చర్ ఆప్షన్ ఎంచుకుంటే, ప్రత్యేకంగా ఫోటో అప్‌లోడ్ అవసరం లేదు.

దశ 2: ఫోటో & సిగ్నేచర్ అప్‌లోడ్
ఫోటో: కేవలం రియల్ టైమ్ ఫోటో తీసే విధానం (వెబ్‌క్యామ్/మొబైల్ కెమెరా ద్వారా)

స్పష్టంగా ముఖం కనబడాలి

టోపీ, క‌ళ్ల‌ద్దాలు, మాస్క్ లేకుండా ఉండాలి

ఫోటో ఫ్రేమ్‌లో ఫేస్ సరిగా ఫిట్ అవ్వాలి

సిగ్నేచర్:

JPEG/JPG ఫార్మాట్‌లో (10KB – 20KB)

సైజు: 6.0 cm (వెడల్పు) x 2.0 cm (ఎత్తు)

దశ 3: దరఖాస్తు ఫారాన్ని నింపడం (Online Application Form)
OTR పూర్తి చేసిన తర్వాత “Apply” సెక్షన్‌లోకి వెళ్లండి

SSC CGL 2025 పరీక్షను ఎంచుకోండి

ఫారం లో వివరాలు నమోదు చేయాలి:

విద్యార్హతలు (పూర్తి డిగ్రీ వివరాలు)

క్యాటగిరీ (SC/ST/OBC/General/PwD/EWS)

పోస్టుల ప్రాధాన్యత (preference order)

ఎగ్జామ్ సెంటర్ ఎంపిక (ప్రాధాన్యత ఆధారంగా 3 చోట్లు)

దశ 4: ఫీజు చెల్లింపు
ఫీజు: ₹100 (మహిళలు, SC/ST/PwBD, ESM కి మినహాయింపు ఉంది)

చెల్లింపు విధానాలు:

BHIM UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు (RuPay, Visa, Mastercard, Maestro)

⏳ ఫీజు చెల్లించడానికి చివరి తేది: 05 జూలై 2025 (23:00 వరకు)

దశ 5: అప్లికేషన్‌ను సమీక్షించి ఫైనల్ సబ్మిట్ చేయడం
ఫారం పూర్తిగా నింపిన తర్వాత “Preview Application” పై క్లిక్ చేసి ప్రతి వివరాన్ని శ్రద్ధగా పరిశీలించాలి

అన్ని వివరాలు సరైగా ఉన్నట్లయితే “Final Submit” పై క్లిక్ చేయాలి

దరఖాస్తు పత్రాన్ని PDF లేదా ప్రింట్ తీసుకోవాలి – భవిష్యత్తులో ఉపయోగపడుతుంది

దశ 6: ఫారం సవరణ అవకాశం
09 జూలై – 11 జూలై 2025 మధ్య, దరఖాస్తులో 2 సార్లు సవరణకు అవకాశం ఉంటుంది

సవరణ ఫీజు:

మొదటి సారి సవరణకు ₹200

రెండవసారి సవరణకు ₹500

సవరణ తర్వాత తాజా ఫారమే చెల్లుబాటు అవుతుంది

📌 ముఖ్య సూచనలు:
అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హత, రిజర్వేషన్ ధృవీకరణ పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక Preview చేసుకొని, తప్పులు లేకుండా అప్లై చేయాలి.

చివరి తేదీ వరకు ఆగకుండా ముందుగానే అప్లై చేయాలి – ట్రాఫిక్ వల్ల వెబ్‌సైట్‌లో సమస్యలు రావచ్చు.

మ‌రిన్ని ఉద్యోగ సంబంధిత వార్త‌ల కోసం ఓజీ న్యూస్‌ని ఫాలో అవండి.

Latest Government Jobs Notification 2025 | SSC CGL 2025 Notification | SSC CGL Notification | How to Apply for SSC? | SSC CGL Application Process | SSC Jobs online application |

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *