
Hyderabad: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు(Samanta) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆమె కంటనీరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన ఆరోగ్యం బాలేదంటూ కొంతమంది.. విడాకుల ఎఫెక్ట్ అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేశారు. దీనిపై సమంత స్వయంగా స్పందించారు. “ఈవెంట్ స్టేజ్ మీద ఉన్నప్పుడు వెలుతురు (లైటింగ్) చాలా ఎక్కువగా ముఖంపై పడింది. నాకు అలెర్జీ ఉంది, అందుకే కళ్లకు నీళ్లు వచ్చాయి. ఇది ఎటువంటి భావోద్వేగంతోనో కాదు, ఆరోగ్య సమస్య కూడా కాదు.. అంటూ సోషల్ మీడియా ఖాతాల్లో రాసుకొచ్చింది.
సమంత ప్రస్తుతం ఓ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్, ఓ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. కొంతకాలం బ్రేక్ తర్వాత శరవేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. సొంతంగా తన బ్యానర్‌పై కొత్త నటులతో సినిమాలనూ నిర్మిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.