Saina-Kashyap Separation: భారత బ్యాడ్మింటన్ అభిమానులకు షాక్ ఇచ్చేలా, ప్రముఖ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట, ఏడేళ్ల వివాహ బంధానికి తెరదించారు.
ఈ మేరకు ఏడేళ్ల వివాహ బంధానికి, రెండు దశాబ్ధాల స్నేహానికి ముగింపు పలుకుతున్నట్లు సైనా నెహ్వాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. చాలా ఆలోచించిన తర్వాతే కశ్యప్, తానూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. వీరిద్దరూ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ భారత్ తరఫున మంచి ప్రదర్శనలిచ్చిన బ్యాడ్మింటన్ ప్లేయర్లే.

సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిన ప్లేయర్. ఒలింపిక్ కాంస్య పతకం విజేతగా పేరు గాంచిన ఆమె, ప్రపంచంలో నంబర్ 1 ర్యాంకు అందుకున్న తొలి భారత మహిళా షట్లర్. పలు అంతర్జాతీయ టైటిళ్లు గెలిచి భారత బ్యాడ్మింటన్‌ను మంచి గుర్తింపు తీసుకొచ్చారు.
పారుపల్లి కశ్యప్ కూడా 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకుని భారత బ్యాడ్మింటన్‌కు గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ఆయన కూడా భారత్ తరపున ఒలింపిక్ మ్యాచ్‌లు ఆడి మంచి ప్రదర్శనలు ఇచ్చాడు.
2018లో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ తెలుగు ప్లేయర్లు.. ఇప్పుడు విడాకులు తీసుకోవడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.