బంగారం నిల్వ‌ల్లో మ‌న‌ స్థాన‌మెంతో తెలుసా..?

Gold in India

Share this article

ఏకంగా 57.12% పెరిగిన ఆర్‌బీఐ సంప‌ద‌

Delhi: భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు(RBI) సంప‌ద‌కు బంగారం నిల్వ‌లు క‌లిసొచ్చాయి. గ్లోబ‌ల్ మార్కెట్ల ప్రభావంతో పెరిగిన బంగారం ధ‌ర‌ల‌తో ఆర్‌బీఐ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఏకంగా 57.12శాతం వృద్ధితో రూ.4.31 ల‌క్ష‌ల కోట్ల‌కు దీని విలువ చేరింది.

ఆర్‌బీఐ తాజాగా విడుద‌ల చేసిన 2024-25 వార్షిక నివేదికలో.. “2025 మార్చి 31 నాటికి రిజర్వ్ బ్యాంక్ కలిగి ఉన్న మొత్తం బంగారం 879.58 మెట్రిక్ టన్నులు కాగా, గత ఏడాది ఇదే తేదీ నాటికి అది 822.10 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే 57.48 మెట్రిక్ టన్నుల పెరుగుదల నమోదైంది. అని వెల్ల‌డించింది.

RBI తాజాగా విడుదల చేసిన 2024-25 వార్షిక నివేదిక ప్రకారం,

బంగారు నిల్వల విభజన.. : ఆర్‌బీఐ ఇష్యూ విభాగం వ‌ద్ద 2025 మార్చి 31 నాటికి 311.38 మెట్రిక్ ట‌న్నుల బంగారం నిల్వ ఉంది. 2024లో ఇదే తేదీ నాటికి 308.03 మెట్రిక్ టన్నులు నిల్వ ఉండేది.

బ్యాంకింగ్ విభాగం వ‌ద్ద‌ 2025 మార్చి 31 నాటికి 568.20 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. 2024లో ఇది 514.07 మెట్రిక్ టన్నులు.

బ్యాంకింగ్ విభాగంలోని బంగారం విలువ రూ. 2,74,714.27 కోట్ల నుండి 57.12 శాతం పెరిగి రూ. 4,31,624.80 కోట్లకు చేరిందని RBI నివేదిక పేర్కొంది. ఈ పెరుగుదలకి బంగారం కొనుగోలు, ధరల పెరుగుదల, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు కారణమయ్యాయని వివరించింది.

#Gold🌍 గోల్డ్ రిజర్వుల్లో భారత్ స్థానం:
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్(India), బంగారు నిల్వల పరంగా ఏడో స్థానంలో నిలుస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) గణాంకాల ప్రకారం, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో బంగారం వాటా 2021లో 6.86 శాతం ఉండగా, 2024 చివరి నాటికి ఇది 11.35 శాతానికి పెరిగింది.

💰 ఎందుకీ నిల్వ‌లు?
విదేశీ మారక నిల్వలు దేశ ఆర్థిక బలాన్ని సూచిస్తాయి. అవి రూపాయి(INR) స్థిరత్వాన్ని కాపాడడంలో, ద్రవ్యోల్బణం నియంత్రణలో, దేశ ఆర్థిక స్థిరతలో కీలక పాత్ర పోషిస్తాయి.

అమెరికన్ డాలర్ ప్రపంచ ప్రధాన రిజర్వ్ కరెన్సీగా ఉన్నప్పటికీ, డాలర్(US Dollor) రేటు హెచ్చుత‌గ్గుల‌ నేపథ్యంలో అనేక దేశాల కేంద్ర బ్యాంకులు గోల్డ్‌ను ప్రత్యామ్నాయ రిజర్వ్ ఆస్తిగా ప్ర‌క‌టిస్తున్నాయి. ఇదిప్పుడు భార‌త్‌కు క‌లిసొచ్చే అంశ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Business News

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *