
Telangana: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు(Congress Government) తెచ్చిన రాజీవ్ యువ వికాసం(Rajeev Yuva Vikasam) పథకం అమలు కార్యచరణ శరవేగంగా సాగుతోంది. జూన్ 2న తెలంగాణా అవతరణ దినోత్సవాల్లో(Telangan Formation Day) భాగంగా ఈ పథకం తొలి విడత లబ్ధిదారులను ప్రకటించేందుకు యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Batti Vikramarka) బుధవారం సెక్రటేరియట్‌లో పథకం అమలు ప్రగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 5లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ లబ్ధి చేకూర్చేలా సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.

జూన్ 2 నుంచి 9 తేదీ వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 15వ తేదీ తర్వాత ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేసుకునే పరిశ్రమల యూనిట్లకు గ్రౌండింగ్ పనులు మొదలు పెట్టనున్నారు. దీంతోపాటూనే జూన్ 10వ తేదీ నుంచి 15 తేదీల వరకు యూనిట్లు పెట్టుకునే లబ్ధిదారులందరికీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సర్కారు ఆదేశించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి వివిధ దశల వారీగా ఈ పథకం అమలు జరిగేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2న రూ.1లక్షలోపు యూనిట్లు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీఓలు దరఖాస్తుదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో దరఖాస్తుదారుల సామాజిక వర్గం, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలను అంచనా వేయనున్నారు. ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రుల అనుమతితో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
Rajeev yuva vikas last date #Rajeev yuva vikasam eligibility