కశ్మీర్(Kashmir)లో పాకిస్థాన్ దాడి ప్రభావిత ప్రాంతాలను ఉద్దేశిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లేఖ రాశారు. తాను ఇటీవల పూంచ్‌తో పాటు కశ్మీర్‌లో పాకిస్థాన్(Pakistan) దాడితో ప్రభావితమైన అన్ని ప్రాంతాలను సందర్శించానని.. అక్కడి హృదయ విదారక దృశ్యాలు తనని కలిచి వేశాయంటూ రాహుల్ లేఖలో పేర్కొన్నారు.
పాక్ చేసిన దొంగ దాడుల్లో మృతి చెందిన 14 మంది పౌరులు, నలుగురు చిన్నారుల కుటుంబాలని కలిశానన్నారు. ఇక్కడి దుకాణాలు, ఇళ్లు, ప్రార్థనాలయాలన్నీ ధ్వంసమయ్యాయని.. వీరిని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని లేఖలో కోరారు రాహుల్.
Operation Sindoor | Rahul Gandhi | Narendra Modi | BJP | Congress | India-Pakistan