BJP బుగ్గారం మండల అధ్యక్షుడు మేడవేణి శ్రీధర్
Jagtial/బుగ్గారం: దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని బీజేపీ బుగ్గారం మండల శాఖ అధ్యక్షుడు మేడవేణి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఎన్డీఏ 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. బీజేపీ మండల పార్టీ కార్యవర్గంతో గురువారం నేతలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జగిత్యాల జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ మంచె రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడవేణి శ్రీధర్ మాట్లాడుతూ.. 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలో సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదకొండో స్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానానికి చేరుకుందని.. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ లాంటి దేశాల తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్నారు. ఈ ఘనత కేవలం ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణలకే దక్కుతుందన్నారు.
ఈ 11 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తీసుకువచ్చిన ఉచిత సిలిండర్, ఇంటింటికి మరుగుదొడ్డి, గత అయిదేళ్లుగా ఉచిత బియ్యం పంపిణి, కిసాన్ సమ్మాన్ నిధి,అసంఘటిత కార్మికులకు ఏడాదికి 12 రూపాయలకే బీమా, బేటీ పడావో బేటీ బచావో, పెద్దనోట్లు రద్దు లాంటి సంక్షేమ పథకాలను అమలు చేసి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందే విదంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. మరోపక్క 370 ఆర్టికల్ రద్దు, వక్ఫ్ బోర్డు సవరణ,జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే లైన్ ల అభివృద్ధి, ఇవాళ జమ్ము కాశ్మీర్ లో కొండల మధ్య రైళ్లు పరుగెడుతున్నాయంటే మోడీ గారి చొరవవల్లనేనని అన్నారు. మోదీ తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటింటికి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిద్దాం..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలను కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు కృషిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని శ్రీధర్ కోరారు. ఆత్మనిర్బర్ లో భాగంగా మేక్ ఇన్ ఇండియా,మేడ్ ఇన్ ఇండియా,స్కిల్ ఇండియా లాంటి పథకాల ద్వారా భారతదేశం సొంత పరిజ్ఞానంతో ఆపరేషన్ సింధూర్ లో ప్రయోగించబడిన బ్రహ్మోస్ మిస్సైల్స్ ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేశాయని అన్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు జూన్ 5 నుండి ఆగస్టు 15 వరకు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కనీసం 11 మొక్కలు నాటి వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా.. బుగ్గారం మండల కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సమావేశంలో బుగ్గారం మండల ప్రధాన కార్యదర్శి మందపల్లి శ్రీనివాస్, దొనకొండ అనిల్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతి రవీందర్ రెడ్డి, బండారి సత్తన్న, కార్యదర్శి నరేష్ సునీల్ , కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు కందునూరు లచ్చయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు చీపిరిశెట్టి మధుకర్, బూత్ అధ్యక్షులు వడకాపురం సతీష్, చెట్ల సునీల్, పంచిత మల్లేష్, గడ్డం మహేష్, గోలి లింగారెడ్డి, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.