
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ ల మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపనుంది. మొన్నటి దాకా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పశ్చిమాసియాతో పాటు ప్రపంచ దేశాలూ అతలాకుతలమయ్యాయి. ఆ రెండు దేశాలతో పాటు పలు యూరోపియన్ దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. లక్షల్లో ప్రాణ నష్టం వాటిల్లింది. ఇప్పుడు భారత్ పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో.. గతంలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో పోయిన ప్రాణాలపై లెక్కలివి. ఇప్పుడు రెండు దేశాల వద్దా వందల్లో అణుబాంబులు, అధునాతన యుద్ధ సామాగ్రి అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల జరిగే ప్రాణనష్టం అంచనా వేయడం కష్టం.
1971 యుద్ధం:
పాకిస్తాన్: 5,866–9,000 మంది మృతి, 10,000–25,000 మంది గాయపడ్డారు.
భారతదేశం: 2,500–3,843 మంది మృతి, 9,851–12,000 మంది గాయపడ్డారు.
1999 కార్గిల్ యుద్ధం:
పాకిస్తాన్: 453–4,000 మంది సైనికులు మృతి చెందారు.
భారతదేశం: 527 మంది సైనికులు మృతి చెందారు.

ప్రస్తుత ఉదంతం (2025 మే 6):
భారతదేశం పాకిస్తాన్ నియంత్రిత కాశ్మీర్‌లోని తొమ్మిది లక్ష్యాలపై “ఆపరేషన్ సిందూర్” పేరిట మిస్సైల్ దాడులు జరిపింది.
పాకిస్తాన్ ప్రకారం, ఈ దాడుల్లో కనీసం ముగ్గురు పౌరులు, ఒక చిన్నారి సహా, మృతి చెందారు; 12 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ రెండు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించింది.
భారత సైన్యం అంచనా ప్రకారం సుమారు 50 మందికి పైగా మరణించి ఉండవచ్చు.