
Telangana: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేధికగా శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మనిచ్చిన నేల అంటూ తెలంగాణ రాష్ట్రంతో తనకున్న బంధాన్ని ట్వీట్‌లో రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan).
జనసేన పార్టీ(Janasena Party)కి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ.
రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.
X tweet, AP Deputy CM Pawan Kalyan, Pawan Kalyan