OTT: హీరో నవీన్ చంద్ర కథల ఎంపిక, నటన ఎలా ఉంటుందో కొత్త పరిచయం అక్కర్లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ లవర్ బాయ్.. తాజాగా నటించిన చిత్రం ‘బ్లైండ్ స్పాట్’ (Blind Spot) ఏ హడావుడి లేకుండా ఓటీటీలో విడుదలైపోయింది. మే 9న థియేటర్లో పెద్ద హంగామా లేకుండానే వచ్చి.. ప్రమోషన్స్‌కి పూర్తి దూరంగా ఉన్న ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ, ఇప్పుడు ఇదే చిత్రం ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తుంది. మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్‌తో ప్రేక్షకులను భయపెడుతోంది ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. నవీన్ చంద్ర, అలీ రెజా, రాశి సింగ్, రవి వర్మ, గాయత్రీ భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.
కథ లోపలికి వెళ్తే… బయటపడటం కష్టం!
దర్శకుడిగా రాకేష్ వర్మ పరిచయమైన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తెరకెక్కించింది. సినిమా కథ మొత్తం ఓ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య నడవడంతో, ప్రతీ ప్రేక్షకుడు అది తమ ఇంట్లోనే జరుగుతుందేమోననే లైవ్ ఫీల్ కల్పించేలా తీశాడు దర్శకుడు.
జయరామ్ (రవి వర్మ), దివ్య (రాశి సింగ్) దంపతులు. వీరికి ఓ పాప కూడా ఉంది. వారింట్లో లక్ష్మి (గాయత్రీ భార్గవి) అనే పని మనిషి పని చేస్తుంటుంది. అయితే ఓ రాత్రి దివ్య ఉరివేసుకుని చనిపోతుంది. కేసును విచారించేందుకు పోలీస్ ఆఫీసర్ విక్రమ్ (నవీన్ చంద్ర) వచ్చి ఆత్మహత్య కాదని, ఇది హత్యేనని డిసైడ్ అవుతాడు. ఆ వెంటనే విచారణ మొదలవుతుంది… ఇంట్లో ప్రతి ఒక్కరిని ఇంటరాగేట్ చేస్తూ, వారి సమాధానాల ఆధారంగా, ప్రతి అడుగులోనూ కొత్త క్లూస్‌ను వెతుకుతూ కేసు ముందుకు సాగుతుంది.

సస్పెన్స్ రైడ్ – చివరి వరకూ ఊహించలేని ట్విస్టులు!
బ్లైండ్ స్పాట్ కథలో ప్రత్యేకత ఏంటంటే, మొదటి ఐదు నిమిషాల్లోనే కథ అసలు పాయింట్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడినుంచి ఎలా జరిగిందనే క్లూ ప్రేక్షకుడికి ఇవ్వకుండా చివరి వరకూ మిస్టరీ కొనసాగుతుంది. ప్రతి క్యారెక్టర్ ఒక అనుమానితుడిలా కనిపించడం, ఎవరి మాటలు నమ్మదగ్గవో కాదో అర్థం కాని పరిస్థితులు.. ఇవన్నీ కలసి థ్రిల్లింగ్ ఎలిమెంట్‌ను పెంచుతాయి. చివర్లో వచ్చే ట్విస్టు అయితే ఆడియన్స్‌ను బెంబేలెత్తేలా చేస్తుంది.
నటుల పెర్ఫార్మెన్స్ హైలైట్
నవీన్ చంద్ర పోలీస్ పాత్రలో బాగా సూటయ్యారు. రవి వర్మ, గాయత్రీ భార్గవి పాత్రలు కీలకంగా నిలిచాయి. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచాయి.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్
క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకునే ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది. ఓ మర్డర్, పది మంది అనుమానితులు, అన్నీ నిజమనిపించే మాటలు.. అసలెవరు హంతకుడు చెప్పకుండా చివరి దాకా సాగే ఈ కథే అసలు మ్యాజిక్.
మీకు మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్లు ఇష్టమైతే ‘బ్లైండ్ స్పాట్’ ని మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే ఈ సినిమా, చివరి వరకూ మిమ్మల్ని మైండ్ గేమ్‌లో లాక్ చేస్తుంది.