
Rajanna Siricilla: రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన నివేదికలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని.. ఇలా చేస్తే కమిషన్ విచక్షణాధికారాలు ఉపయోగించాల్సి ఉంటుందని మండిపడింది. గతేడాది ఆగస్టు 2వ తేదీన అనారోగ్యంతో మంచంపై పడుకున్న పిట్ట రామలక్ష్మీ(78)పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎటూ కదల్లేని స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని అత్యంత క్రూరంగా చంపేసి పీక్కుతున్నాయి. అయితే, దీని తర్వాత స్థానిక యంత్రాంగం వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టింది. దీనిపై స్థానిక న్యాయవాది ఇమ్మనేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. స్పందించిన కమిషన్.. పూర్తి ఘటనపై నివేధిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనపై కలెక్టర్ తాజాగా పంపిన నివేధికపై కమిషన్ మండిపడింది. పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా నివేధిక రూపొందించారని.. ఒకవేళ కమిషన్ విచక్షణాధికారులు ఉపయోగిస్తే.. నేరుగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం.