
Amaravathi: అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని నరేంద్ర మోదీ(Modi), ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేధికపై ప్రసంగించి తిరిగి తన స్థానంలో కూర్చునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ను.. తన వద్దకు పిలిపించుకున్న మోదీ పవన్ చేతికి ఏదో అందించారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పవన్ పగలబడి నవ్వారు. తిరిగి వస్తూ.. మోదీకి నమస్కరించి వచ్చి తన స్థానంలో కూర్చున్నారు పవన్. అయితే, పవన్ చేతికి అందించిన పధార్థం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చాకొలేట్ అని కొందరు అంటే, దగ్గు మాత్ర అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే, ప్రసంగం సమయంలో పవన్ మధ్యమధ్యలో దగ్గుతూ కనిపించారు. గొంత సరిచేసుకుంటూ.. దగ్గును నియంత్రించుకుంటూ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఇది గమనించిన ప్రధాని మోదీ తన సహాయకులను పిలిచి కఫ్ క్యాండీలు (దగ్గు బిల్లలు) తెప్పించినట్లు తెలిసింది. పవన్ ను రమ్మని పిలిచి తన చేతిలో స్ట్రెప్సిల్స్ పెట్టి జాగ్రత్త అని చెప్పారట. ఇది చూసి పక్కనే ఉన్న చంద్రబాబుతో సహ పవన్, పక్కనే వేధికపై ఉన్న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని నవ్వారు. ఇది సభకు హాజరైన వారితో పాటు నెటిజన్లనూ ఆకట్టుకుంది. ఇప్పుడిదే సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారింది.