
Hyderabad: బీఆర్ఎస్(BRS Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Ex CM KCR)కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత (Kavitha Kalvakuntla) లేఖ రాసినట్లు కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆరు పేజీలు ఉన్న ఈ లేఖలో పార్టీ, వరంగల్ సభ గురించి పూర్తిగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రాసినట్లు కనిపిస్తోంది. డియర్ డాడీ.. అంటూ మొదలైన ఈ లేఖలో.. కవిత.. పార్టీ నేతలకు ఆక్సెస్ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ సభలో(Warangal BRS Sabha) స్టేజీపైకి మీరు వచ్చే ముందు మన పార్టీ సీనియర్ నేతలను మాట్లాడించాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఇదే కాకుండా 2001 నుంచి మన పార్టీలో ఉన్నవారు అక్కడ ప్రసంగిస్తే బాగుండేదని.. ధూంధాం సైతం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలమైందన్నారు. బీజేపీపై బలంగా మాట్లాడి ఉండాల్సిందని.. ఇప్పటికే ఆ పార్టీతో పొత్తుపై పుకార్లు రేగుతున్నాయంటూ రాసుకొచ్చారు. (Letter to KCR)
తాను బీజేపీ పార్టీ(BJP)తో చాలా ఇబ్బంది పడ్డానని.. ఇంకొంచెం ఆ పార్టీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అంటూ పేర్కొన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన మెసేజ్ కాంగ్రెస్ బలంగా జనాల్లోకి తీసుకెళ్లిందని.. ఇప్పటికైనా ప్లీనరీ పెట్టాలంటూ అందులో సూచించారు. ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టం గురించి మాట్లాడలేదని అందులో పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికలను పాత ఇంచార్జ్‌లకు అప్పజెప్పడం వల్ల వాళ్లు తెలంగాణా ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ లేఖలో వాపోయారు. ఓవరాల్‌గా మొన్నటి వరంగల్ సభ నుంచి కార్యకర్తలు ఇంకొంచెం పంచ్ ఎక్స్‌పెక్ట్ చేశారంటూ ఆ లేఖను ముగించారు.

అయితే, ఈ లేఖ కల్వకుంట్ల కవితే రాశారా లేదా అన్నదానిపై స్పష్టత లేకున్నా ప్రధాన మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ, కవిత నుంచి వివరణ రావాల్సి ఉంది. గత కొంత కాలంగా ఆమె పార్టీ మారనున్నారని(Party Change) కొందరు.. కొత్త పార్టీ(New Party) పెడతారని కొందరు వాదిస్తుండగా.. ఈ లేఖ అగ్గికి ఆజ్యం పోసినట్లయింది.