
Mirai: హనుమాన్(Hanuman) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) హీరోగా.. నటుడు మంచు మనోజ్(Manchu Manoj) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మిరాయ్ టీజర్ విడుదలైంది. ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చారిత్రక అంశాల నేపథ్యంలో రానుంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
బుధవారం విడుదలైన టీజర్ కళ్లు చెదిరే విజువల్స్ తో ఆకట్టుకుంటుండగా.. ఇది మౌర్య చక్రవర్తి సామ్రాట్ అశోకుడికి సంబంధించిన కథగా కనిపిస్తోంది. ఆ కాలంలో అత్యంత శక్తిమంతమైన ఆయుధం ‘మిరాయ్’ చుట్టూనే కథ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆయుధాన్ని వాడి మానవజాతిని అంతం చేసేందుకు ప్రయత్నాలు చేసే దుష్ట శక్తులను అడ్డుకునే పవన్ ఫుల్ పాత్రలో తేజ సజ్జా కనిపించనున్నారు. యాక్షన్ ప్యాక్‌డ్ సీన్లు, ఇద్దరు నటుల ఎలివేషన్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి శ్రియా శరణ్, జయరామ్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.