సోషల్ మీడియాలో పేరు కోసం వింత చేష్టలకు తెగబడుతున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్లు. ఫ్రాన్స్ కు చెందిన ఓ యువకుడు ఏలియన్ గా మారడానికి ఊహిస్తేనే భయం పుట్టే పనులు చేశాడు.
ఫ్రాన్స్(France) కు చెందిన ఆంథోనీ లెఫ్రెడో (Antony Lefredo) తనను రూపాన్ని బ్లాక్ ఏలియన్ (Black Alean) లాగా మార్చాలని అనుకున్నాడు. కొన్నేళ్ల నుంచి సర్జరీలు చేయించుకుంటూ ఉన్నాడు. నాలుకను రెండుగా కోయించుకున్నాడు. రెండు చెవులు.. రెండు చేతులకు ఉన్న చిటికెన వేలు, దాని పక్కన వేలును తీసేయించుకున్నాడు. లెక్కలేనన్ని సర్జరీలు చేయించుకున్నాడు. శరీరంలో ప్రమాదకరమైన వస్తువుల్ని అమర్చుకున్నాడు. శరీరం మొత్తం నల్లటి రంగును ట్యాటూ వేయించుకున్నాడు.

అతడ్ని చూస్తే.. చిన్న పిల్లలే కాదు.. పెద్ద వాళ్లు కూడా భయపడేలా మారాడు. ఆంథోనీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు పెట్టాడు. ఇప్పటి వరకు తాను 66 శాతం నల్ల ఏలియన్‌లా మారినట్లు చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఆంథోనీ ఏలియన్ లుక్ ఫోటోలు వైరల్‌గా మారాయి. కొంతమంది ఆంథోనీని పొగుడుతూ ఉంటే.. మరికొంతమంది దుమ్మెత్తి పోస్తున్నారు.