
ఆదిత్య 369.. ఈ సినిమా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. టైమ్ ట్రావెల్ మెషిన్(Time Travel) లో గతకాలానికి వెళ్లే నందమూరి బాలకృష్ణ.. శ్రీకృష్ణ దేవరాయలని కలిసొస్తాడు. ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే ట్రెండ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి(Mallareddy).
తన ప్రత్యేక శైలి, వినూత్న కామెంట్లతో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈసారి ఆయన కాలేజీల ప్రమోషన్ కోసం ఏకంగా ఆయన ఓ “టైమ్ మెషిన్ లో ట్రావెల్ చేశారు. అందులో ప్రయాణించి వెనక్కి వెళ్లిన ఈ మాజీ మంత్రి చాణక్యుడు, స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం, మదర్ తెరిసా వంటి ప్రముఖులను కలిసినట్లు చూపించారు.

AI సాంకేతికత సహాయంతో రూపొందించిన ఈ వీడియోలో ప్రముఖులంతా మల్లారెడ్డికి విద్యా రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విలువలు, నాణ్యత గురించి సూచనలు చేస్తారు. దానికి బదులుగా.. మీరు చెప్పినట్లే అదే స్థాయిలో విద్యను అందిస్తానంటూ మల్లారెడ్డి చేసే ప్రామిస్ తో వీడియో ముగుస్తుంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. మల్లారెడ్డా మజాకా అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో “పాలమ్మినా, పూలమ్మినా” వీడియో ఎంత ట్రెండ్ అయిందో ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. ఎప్పుడూ మీమర్లకు కంటెంట్ అయ్యే మల్లారెడ్డి ఇప్పుడు కొత్త స్టఫ్ తో మరోసారి ట్రెండింగ్లో నిలుస్తున్నారు.
AI టెక్నాలజీతో ఇటీవల దివంగత నేతలు, ప్రముఖుల వీడియోలు తయారుచేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవలి “మహానాడు”లో కూడా AI తో రూపొందించిన ఎన్టీఆర్ వీడియో హైలైట్ అయింది.
Aditya 369, Chamakura Mallareddy, Nandamuri Balakrishna