చంద్ర‌బాబును చూసే టెక్నాల‌జీ నేర్చుకున్నా: మోదీ

Share this article

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవ సభలో ప్ర‌సంగిస్తూ.. తాను టెక్నాల‌జీ చంద్ర‌బాబును చూసే నేర్చుకున్నాన‌న్నారు. త‌న‌కే కాదు ఎంతోమందికి అధునాత‌న సాంకేతిక‌త‌లను ప‌రిచ‌యం చేసింది బాబేనంటూ మోదీ పొగిడారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌ను తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణాలో హైద‌రాబాద్, సైబ‌రాబాద్ అభివృద్ధిపై వాదోప‌వాదాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఐటీ హ‌బ్‌గా మార్చింది కేటీఆర్ అని బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, కాదు.. ఐటీని తెచ్చింది న‌గ‌రాన్ని క‌ట్టింది చంద్ర‌బాబేన‌ని టీడీపీ త‌మ్ముళ్లు పెద్ద యుద్ధాలే చేశారు. చంద్ర‌బాబును విమ‌ర్శించేందుకూ వైసీపీ, బీఆర్ఎస్ సైతం సంయుక్తంగా ఇదే ఆయుధాన్ని ఇన్ని రోజులు వాడాయి. అయితే, ఇప్పుడు మోదీ సైతం టెక్నాల‌జీలో చంద్రబాబును చూసి నేర్చుకున్నాన‌న‌డంతో తెలుగు దేశం ఈ వ్యాఖ్య‌ల‌ను వైర‌ల్ చేస్తోంది.

ఇదే వేధిక‌పై మోదీ సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కల సాకారం చేస్తామని అన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ కోసం ఎన్టీఆర్‌ కలలు కన్నారు. నేను, చంద్రబాబు, పవన్‌ కలిసి వికసిత్‌ ఆంధ్ర కోసం కృషి చేస్తాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దుష్టగ్రహాలన్నీ పారిపోయాయి. అని చెప్పుకొచ్చారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *