Review: కుబేరా సినిమా ఎలా ఉందంటే..?

Kubera Movie Review

Share this article

Review: నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో రూపొందిన సౌత్ ఇండియా మోస్ట్ అవెయిటెడ్‌ మూవీ ‘కుబేరా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య, శుక్రవారం ఉద‌యం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విదేశాల్లో ముందే ప్రదర్శింపబడిన ఈ సినిమాపై మొదటి నుంచే పాజిటివ్ టాక్ ఏర్పడింది. ప్రీమియర్ షోల నుంచే సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కనిపించింది. తెల్లవారుజాము నుంచే సోషల్ మీడియాలో ఈ సినిమాపై అభిమానులు, నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. ఆ అభిప్రాయాల‌తో పాటు స‌మీక్ష‌కుడి విశ్లేష‌ణ‌తో ఈ కుబేరా రివ్యూ.

క‌థేంటంటే..?
దేవ (ధ‌నుష్‌) దిగువ పేద‌రికంలో ఉంటాడు. వీటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అక్ర‌మ మార్గాల్లోకి వెళ్లాల్సి వ‌స్తుంది. ఎలాగైనా ఎద‌గాల‌నే ల‌క్ష్యంతో త‌ప్పుడు దార్లు తొక్కుతుంటాడు. బ్లాక్ మ‌నీ సంపాదించే ప‌నిలో ప‌డిన దేవా వెన‌క సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) ఎందుకున్నారు..? ఈ కథలో ఎవరికి ఎవరు నిజమైన శత్రువు? దేవ తప్పు చేస్తున్నాడా? దీపక్ ధర్మబద్ధుడా? చివరికి దేవ ఏమవుతాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

ఎలా ఉంది..?
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ధనుష్ ఎంట్రీ త‌ర్వాత సినిమా ఊహించని విధంగా మారిపోతుంది. ఈ పాత్ర‌కు ధ‌నుష్ త‌ప్ప ఇంకెవ‌రూ న్యాయం చేయ‌లేర‌న్నంత‌గా సినిమా ఆక‌ట్టుకుంటుంది. అత‌ని పాత్ర భావోద్వేగాలు హృద‌యాల్ని తాకుతాయి. ఇక నాగార్జున పాత్ర కూడా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. సీబీఐ అధికారిగా ఆయన చేసిన క్యారెక్టర్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నాగార్జునకు ఇలాంటి శక్తివంతమైన పాత్ర కొంతకాలంగా రాలేదని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయిందని, శేఖర్ కమ్ముల నాగార్జునను మరో మారు అద్భుతంగా ప్రదర్శించారు.

రష్మిక మందన్నకూ ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. శేఖర్ కమ్ముల పూర్వ సినిమాల్లోని మహిళా పాత్రల మాదిరిగానే ఆమె పాత్రకి మంచి డెఫ్త్ ఇచ్చారు. రష్మిక ఈ సినిమాతో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె పాత్ర కథలో కీలకంగా మారడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. కానీ నిడివి కాస్త త‌క్కువ‌.

Kubera movie review

కథనం పరంగా సినిమా బాగా ఆకట్టుకుంటోంది. బ్లాక్‌మనీ నేపథ్యంలో societal greed, power dynamics ను చూపించడానికి శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన నెమ్మదైన కథా శైలిని పాటించారు. ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా దూసుకుపోతుంటే, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టర్న్స్ ప్రేక్షకులను మరింతగా ఇన్వాల్వ్ చేసేలా చేస్తాయి. అయితే, సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల పేసింగ్ కొంచెం నెమ్మదిగా మారిందని ప్రేక్షకులలో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ కి ముందు కొంత లాగ్ అయిందనే ఫీల్ వినిపిస్తోంది. కానీ ఈ చిన్న లోపాలను మినహాయిస్తే సినిమా మొత్తంగా ప్రేక్షకులను మెప్పించేలా సాగుతుంది.

శేఖర్ కమ్ముల టేకింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమా ద్వారా తాను ఎందుకు డిఫరెంట్ డైరెక్టర్‌ అనిపించుకున్నాడో మళ్లీ నిరూపించుకున్నాడు. కథ చెప్పే విధానం, పాత్రల అభివృద్ధి, డైలాగ్స్ అన్నీ కమ్ముల మార్క్‌లోనే ఉన్నాయి. కథలో ఎక్కడా అనవసరంగా మాస్ ఎలిమెంట్స్‌ మిళితం చేయకుండా కథని ఆయన పద్దతిలో చక్కగా నడిపించారు.

ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. సినిమాలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో సంగీతం సినిమాకే ప్రాణం పోసింది. పాటల దృశ్యాలు ప్రేక్షకులను ఇమర్షన్ లోకి తీసుకువెళ్లేలా ఉన్నాయి.

సినిమాకు సంబంధించి మరో హైలైట్ – సెకండ్ హాఫ్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు. ఈ సీన్స్ సినిమా నడిపించే అసలు క‌థ‌. చూస్తున్నంత సేపు క‌ళ్లలో నీళ్లు తిరుగుతుంటాయి.

బ‌ల‌హీనత‌లు:
ఈ సినిమాలో చెప్పుకోద‌గ్గ మైన‌స్ పాయింట్లు ఏమీ లేవు. ర‌ష్మిక పాత్ర నిడివి కాస్త త‌క్కువుండ‌టం, ఫ‌స్ట్ హాఫ్ క‌థ కాస్త నెమ్మ‌దిగా అనిపించ‌డం మినహాయించి ఇదొక పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ సినిమా.

చివరగా, కొన్ని చిన్న చిన్న లోపాలను పక్కనపెడితే ‘కుబేరా’ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చే సినిమా. ఎమోషన్, యాక్షన్, మంచి కథ, గొప్ప నటన – అన్నీ కలబోసిన సినిమా ఇది. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను తేలికగా ఎంజాయ్ చేయగలరు.

ఓజీ రేటింగ్‌: ★★★★☆ (4/5)

Kubera Movie Review
Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *