
కడప(Kadapa) జిల్లా మైలవరంలో ఐదు రోజుల క్రితం మూడేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా అత్యాచారం(Rape) చేసి హత్య చేసి మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ(Janasena Party) ప్రధాన కార్యదర్శి గునుకుల కిశోర్ కోరారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టం నుంచి తప్పించుకోవచ్చనే భావనతోనే ఇలాంటి అకృత్యాలు ఇంకా జరుగుతున్నాయన్నారు. సమీప బంధువే ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడం ఘోరమైన విషయమన్న ఆయన.. ఫోక్సో కేసు పెట్టినప్పటికీ కఠిన శిక్షలు సత్వరమే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇంకొకరు ఇలాంటి తప్పు చేయాలంటేనే భయపడేలా శిక్షలు ఉంటేనే పరిష్కారం ఉంటుందని.. ఈ దుర్ఘటనను పార్టీ తరఫున ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయం ఇంచార్జ్ జమీర్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, నాయకులు శేఖర్ రెడ్డి, శ్రీకాంత్, ప్రశాంత్, రిషి యాదవ్, మహేశ్ శర్మ, రవి కుమార్, గుర్రం కిషోర్, సుధా మాధవ్, మార్కెట్ సురేశ్, హేమంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.