
Andhrapradesh: ఏపీలో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ వివాదంపై జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రికి చెందిన జనసేన(Janasena) పార్టీ నేత అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈమేరకు జనసేన పార్టీ నేత, టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా మొదలైన అవాంఛనీయ థియేటర్ల బంద్ విషయంలో సత్యనారాయణ పాత్ర ఉన్నట్లు తెలుసుకున్నామన్నారు. ఇది అవాస్తవమో, వాస్తవమో నిరూపణ చేసుకున్న తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
ఇప్పటికే తెలుగు సినిమా ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు థాంక్స్ అంటూ తీవ్రస్థాయిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. దీని వెనక నలుగురు నిర్మాతల కుట్ర ఉందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో నిర్మాతలు అల్లు అరవింద్ సహా దిల్ రాజు వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెట్టి తమకు అంత ధైర్యం లేదని ప్రకటించుకున్నారు. ఇది తూర్పు గోదావరి కేంద్రంగానే పుట్టిందని స్పష్టం చేశారు. ఇప్పటికే సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాల మేరకు హోం శాఖ దీనిపై విచారణ జరుపుతోంది.