Mangalagiri: జనసేన పార్టీ(Janasena Party) కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంలో.. పార్టీని బలోపేతం చేయడంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ ఛైర్మన్ కళ్యాణం శ్రీనివాస్(KK) ముఖ్య భూమిక పోషిస్తున్నారని జనసేన మర్రిపాడు మండల పార్టీ నాయకులు చిన్నా జనసేన పేర్కొన్నారు. శనివారం కళ్యాణం శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసిన చిన్నా జనసేన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చిన్నా మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడి నుంచి నేటి రాష్ట్ర స్థాయి నాయకుడి దాకా ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే నిజాయతీ ఆయన నుంచి ప్రతీ యువ నాయకుడూ నేర్చుకోవాలని.. ఆయన నడవడిక, మాటలు, నాయకత్వ లక్షణాలూ స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన చిన్నా.. ఆయన ఎప్పుడూ బాగుండాలని.. మరింత ఉన్నత స్థానంలో ఆయన ఉండాలని ఆకాంక్షించారు.