
GTvsSRH: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహనం కోల్పోయాడు. అంపైర్‌పై మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపైకి దూసుకెళ్లాడు. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో(Hyderabad) జరిగిన మ్యాచ్‌లో గిల్ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. 13వ ఓవర్లో జోస్ బట్లర్(Butler) బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. ఓ సింగిల్ తీశాడు. అయితే ఫీల్డర్ హర్షల్ పటేల్ బంతిని అందుకుని వికెట్ల వైపు విసిరాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి పరుగు కోసం వచ్చిన గిల్ క్రీజ్‌లోకి చేరుకోలేకపోయాడు. అయితే, థర్డ్ అంపైర్ తన నిర్ణయం వెల్లడించడానికి చాలా సమయం తీసుకున్నాడు. బంతి నేరుగా స్టంప్స్ కి తగిలిందా లేదా వికెట్ కీపర్ గ్లోవ్స్ ఆ స్టంప్స్‌కి తగిలాయా అన్నది తేల్చడం ఇబ్బందిగా మారింది. కానీ, చివరకు సన్‌రైజర్స్‌కు ఫేవర్‌గా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

అంపైర్ ఇచ్చిన నిర్ణయం పట్ల గుజరాత్ కెప్టెన్(Gujrath Titans Captain) తన అసంతృప్తి వ్యక్తం చేశారు. డగౌట్ వద్ద ఉన్న మ్యాచ్ అఫీషియల్‌తో వాగ్వాదానికి దిగాడు. వాడివేడిగా తన ఔట్ గురించి చర్చించాడు. ఆ వాగ్వాదానికి చెందిన గొడవ కెమెరాలకు చిక్కింది. ఆ మ్యాచ్లో 38 బంతుల్లో 76 పరుగులు చేసిన గిల్ ఇలా ఔటయ్యాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఆరు వికెట్లకు 224 రన్స్ చేసింది. గిల్ 76, సుదర్శన్ 48, బట్లర్ 64 రన్స్ చేశారు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్(SRH) జట్టు ఆరు వికెట్ల నష్టానికి 186 రన్స్ మాత్రమే చేసింది.