
MI vs GT: వరస విజయాలతో ఊపు మీదున్న ముంబై ఇండియన్స్‌ను(Mumbai Indians) గుజరాత్ కుప్పకూల్చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. వరస వికెట్లతో కీలక బ్యాటర్లను పెవీలియన్ కు పంపింది. 20 ఓవర్లలో 8 వికెట్లు తీసి 155 పరుగుల వద్ద ముంబైని కట్టడి చేసింది. కీలక బ్యాటర్లు రోహిత్ శర్మ 7(8), రికెల్టన్ 2(2), తిలక్ వర్మ 7(7), కెప్టెన్ హార్దిక్ పాండ్య 1(3), నమన్ ధీర్ 7(10) పరుగులకే ఔటయ్యారు. విల్ జాక్స్ 35 బంతుల్లో 53 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 24 బంతుల్లో 35, బోష్ 22 బంతుల్లో 27 పరుగులతో రాణించడంతో ముంబై గౌరవప్రద స్కోరుతో బయటపడింది. గుజరాత్ బౌలర్లో సాయికిశోర్ కు 2 వికెట్లు దక్కగా.. మిగతా బౌలర్లు చెరో వికెట్‌తో సరిపెట్టుకున్నారు. గుజరాత్ 155 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది.