
India-Pakistan: భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం(War) మొదలైంది. కశ్మీర్(Kashmir) పహల్గాంలో హిందూ పర్యాటకులపై ఉగ్రదాడికి దన్నుగా నిలవడంతో పాటు గత వారం రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో, సరిహద్దు వెంబడి భారత సైనికులపై కాల్పులు జరుపుతూ రెచ్చగొడుతున్న దాయాదికి ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో మంగళవారం అర్ధరాత్రి ధీటైన జవాబిచ్చింది భారత్(India). ఉగ్రవాదుల స్థావరాలుగా నిర్ధారించుకున్న 9 ప్రాంతాలపై వైమానిక దళాలు మిసైళ్ల వర్షం కురిపించాయి. మసూద్ అజహార్(Masood Azahar) లాంటి ముష్కర నాయకుల అనుచరులను హతమార్చి, వారి గడ్డపై విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో ముష్కరులు తీవ్రంగా గాయపడ్డారని వినికిడి.
అయితే, భారత్ దాడికి అమెరికాలాంటి అగ్రదేశాలు సహా పలు ప్రధాన దేశాలు మద్దతునివ్వగా.. బుధవారం సాయంత్రం నుంచి త్రివిధ దళాలు భారత్‌పై ప్రతిదాడి చేయాలంటూ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్(Shahbaz Shareef) ఆదేశాలిచ్చారు.
ఇటీవలె రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఇప్పుడు రెండు అత్యధిక అణు సంపద కలిగిన రెండు దేశాలు యుద్ధం మొదలుపెడితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి.. ఈ రెండింట్లో ఎవరు ఎక్కువ నష్టపోతారు, ఏయే విషయాలు కీలకం కానున్నాయి అనే విషయాలతో పాటు ఇరు దేశాల బలాబలాలు, విజయావకాశాలపై ఓజీ విశ్లేషణ.

భారత సైనిక శక్తి:
ర్యాంకింగ్: గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం, భారత్ 4వ స్థానంలో ఉంది.
సైనికులు: 14 లక్షల 60 వేల యాక్టివ్ సైనికులు, 12 లక్షల రిజర్వ్ సైనికులు.
రక్షణ బడ్జెట్: రూ.8వేల కోట్లు
సైనిక సంపద : 4,200 యుద్ధ ట్యాంకులు, 2,229 యుద్ధ విమానాలు, 293 యుద్ధ నౌకలు (2 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు).
న్యూక్లియర్ ఆయుధాలు: 150+ వార్‌హెడ్‌లు. “No First Use” విధానం.
(భారత్ నో ఫస్ట్ యూజ్ విధానాన్ని ఇప్పుడు కూడా పాటించనుంది. ప్రత్యర్థి మొదలుపెడితే మాత్రం ఎంత నష్టమైన అణుబాంబులు వాడేందుకు నిర్ణయించుకుంది.)

పాకిస్థాన్ సైనిక శక్తి: (Pakistan Army)
ర్యాంకింగ్: గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం, పాకిస్థాన్ 12వ స్థానంలో ఉంది.
సైనికులు: 6 లక్షల 54వేల యాక్టివ్ సైనికులు, 5 లక్షల పారా మిలిటరీ సిబ్బంది.
రక్షణ బడ్జెట్: రూ.1వెయ్యి కోట్లు.
సైనిక సంపద: 2,627 ట్యాంకులు, 1,399 విమానాలు, 121 నౌకలు.
న్యూక్లియర్ ఆయుధాలు(Nuclear Weapons): 160+ వార్‌హెడ్‌లు; “First Use” విధానం
(యుద్ధం ఎప్పుడు సంభవించిన మొదట తామే వినియోగించే తీర్మానం పాక్ పాటిస్తోంది. అంతర్జాతీయ అనుమతులు సైతం పొందింది)
ఎవరి సామర్థ్యమెంత..?
భారతదేశం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సాయుధ బలగాలను కలిగి ఉన్న దేశం. అధునాతన ట్యాంకులు, యుద్ధ విమానాలు, నౌకాశక్తి – ఇవన్నీ భారత సైనిక శక్తికి బలాన్నిస్తాయి. అంతేగాక, ఇజ్రాయిల్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో వ్యూహాత్మక సహకారం ఉండటం భారతదేశానికి రెట్టింపు బలం.
ఇదే సమయంలో, పాకిస్థాన్ సైతం అణ్వాయుధ దేశమే అయినా, యాక్టివ్ మిలిటరీ పరిమితంగా ఉంది. చైనా, తుర్కియే ఇప్పటికే బహిరంగ మద్దతు తెలపగా.. ఇస్లామిక్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోందనే కారణంతో అగ్ర దేశాలు వ్యూహాత్మక ఒప్పందంలో భాగం కాలేదు. ఇప్పుడు చైనా అక్రమ దారుల్లో సాయం అందించనుందని విశ్లేషకుల అంచనా. ఒకవేళ పాకిస్థాన్ అణు బాంబుల విషయంలో ఫస్ట్ యూజ్ విధానమే ఈరోజు మొదలుపెడితే ఇరువైపులా తీవ్ర నష్టం తప్పదు.
💰 ఆర్థిక ప్రభావం:
భారతదేశం
యుద్ధ ఖర్చు: ప్రతిరోజు రూ.100కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
ఆర్థిక ప్రభావం: దీర్ఘకాలికంగా ఫిస్కల్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉంది.
స్టాక్ మార్కెట్: ప్రారంభంలో తగ్గినప్పటికీ, రెండు రోజుల నుంచి కోలుకుని స్థిరంగా ఉంది.
పాకిస్తాన్
ఆర్థిక స్థితి: IMF నుండి రూ.700కోట్లు అప్పు తెచ్చుకున్నప్పటికీ.. ఆర్థిక స్థిరత్వం ఐదేళ్లుగా ఆ దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య.
స్టాక్ మార్కెట్: భారత్ అర్ధరాత్రి దాడి తర్వాత.. 6 గంటల్లోనే 6% వరకు పడిపోయింది.
రూపాయి విలువ: డాలర్‌తో పోలిస్తే 84.68 వరకు పడిపోయింది.
ఆర్థికంగా.. పాక్ -1, భారత్ +10..: భారతదేశం 2025 నాటికి 3.9 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచింది. యుద్ధం వల్ల కొన్ని రంగాలపై ప్రభావం పడినా, భారత్‌కు ఉన్న బలమైన ఫెడ్ రిజర్వ్‌లు, ఎఫ్‌డీఐలు, గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రణాళికలతో ధృడంగా మారిన తయారీ రంగం సాయంతో ఈ ప్రభావాన్ని తట్టుకునే స్థితిలోనే ఉంది.

మరోవైపు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఐఎంఎఫ్ రుణాలపై ఆధారపడుతున్న దేశం.. దివాలా తీసేందుకు సిద్ధంగా ఉంది. యుద్ధం వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు ఉండకపోగా, అప్పులూ పుట్టే అవకాశం ఎంతమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే పాకిస్థాన్‌కు దిగుమతులు నిలిచిపోగా.. నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడనుంది. అది సామాన్యలపై భారంగా మారనుంది.
📉 వాణిజ్య సంబంధాలు
భారత ఎగుమతులు: 2024 ఏప్రిల్ నుండి 2025 జనవరి వరకు రూ.38వేల కోట్లు.
పాకిస్తాన్ ఎగుమతులు: కేవలం రూ.3 కోట్ల 56లక్షలు
ప్రస్తుత పరిస్థితి: భారత్ పాకిస్తాన్ నుండి వచ్చే అన్ని దిగుమతులను నిషేధించింది. ఇది అక్కడి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు శాశ్వత నష్టాన్ని కలిగించవచ్చు.

💧 నీటికీ కటకటే!
భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో కుదిరిన ‘ఇండస్ వాటర్ ట్రీటీ’ ద్వారా సింధు నదీ జలాల్లో పాకిస్థాన్ 80శాతం వినియోగించుకుంటోంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న పాక్‌కి సింధు జలాలే జీవాధారం. అయితే ఇటీవల కశ్మీర్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని ప్రకటించడంతో పాటు నీటి విడుదలను ఆపేసింది. ఇది ఆ దేశ వ్యవసాయ రంగానికి పెద్ద దెబ్బ.
పంజాబ్, సింధ్ ప్రాంతాలు ఈ నీటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ నీటి ప్రవాహం ఆగిపోతే వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా నాశనమవుతాయి. దీనివల్ల ఆహార కొరతతో పాటు అక్కడి గ్రామాల మధ్య అంతర్గత పోరు మొదలయ్యే అవకాశం ఉంది.
పాకిస్థాన్.. వందేళ్లు వెనక్కి!
ఆర్థిక విధ్వంసం, రాజకీయ అస్థిరత, పాలనా పరమైన నిర్ణయాల్లో సైన్యం ఆధిపత్యం, బలూచిస్థాన్ లాంటి స్వాతంత్య్ర ఉద్యమాలు వెరసి.. ఇప్పటికే పాకిస్థాన్ ఓ దేశంగా పాతాళానికి చేరుకుంది. ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వి భారత్‌తో యుద్ధానికి దిగితే అక్కడి ప్రతి పౌరుడి జీవితం ధ్వంసమవడమే కాకుండా.. మరో వందేళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. ఒకవేళ అణ్వాయుధ దాడే జరిగితే ఆ దేశ ఉనికి ప్రపంచ పటంలోనే ఉండకపోవచ్చు.
ఇది సుస్ఫష్టంగా గెలుపోటముల సందర్భం కానే కాదు. రెండు దేశాల భవిష్యత్తు స్థిరత్వం గురించి, 165 కోట్ల పౌరుల జీవితాల గురించి. రేపటి యుద్ధంలో గెలిచినా ఓడినా ఆ దేశ ఆర్థిక, సైనిక, వాణిజ్య, ఆహార, జీవన పరిస్థితులు చిన్నాభిన్నమవక తప్పదు. అంతర్గత అస్థిరత తోడు దేశం ఉనికి ప్రశ్నార్థకం కావొచ్చు.