IEI: ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ సెంటర్‌కు సంబంధించిన ఎన్నికలు శనివారం లో జరిగాయి. 2025-27 సంవత్సరానికి గాను జరిగిన ఎన్నికల్లో ఛైర్మన్‌గా ప్రొఫెసర్ డా. రమణ నాయక్ బానోతు (FIE) ఎన్నికయ్యారు. అలాగే, హానరరీ సెక్రటరీగా రిటైర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా మర్రి రమేశ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వీరికి ఇంజినీర్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

IEIకి వందేళ్ల చరిత్ర
దేశంలోని ఇంజినీర్ల కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థే ఈ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (IEI). ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ సొసైటీ. ఇందులో 15 విభాగాలకు చెందిన మిలియన్ కంటే ఎక్కువ మంది ఇంజినీర్లు సభ్యత్వం కలిగి ఉన్నారు. 1920లో స్థాపించిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది. 1935లో రాయల్ చార్డర్ ద్వారా గుర్తింపు పొందగా అప్పటి నుంచి ఇంజినీరింగ్ రంగంలో నైపుణ్యం పెంపొందిచేందుకు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు నాణ్యమైన ప్రమాణాలు పాటించేందుకు కృషి చేస్తుంది. కాగా, IEIకి అనుబంధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) కూడా పనిచేస్తోంది. ఇది శిక్షణ & అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
హైదరాబాద్ కేంద్రానికే అధిక ప్రాముఖ్యత
ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (IEI)కు చెందిన కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉండగా తెలంగాణలోని స్టేట్ సెంటర్‌కు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ వివిధ విభాగాల్లో సభ్యులను కలిగి ఉండే ఈ సంస్థ ఇంజినీర్లకు వేదికగా పనిచేస్తూ సాంకేతిక సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. అయితే, ఎన్నికలు సజావుగా జరగడంతో తెలంగాణలోని ఇంజినీరింగ్ వర్గాల్లో సానుకూల స్పందన లభిస్తోంది. కొత్తగా ఎన్నికైన నేతలు సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారని ఇంజినీర్లు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.