Hyderabad: నిరుద్యోగ యువత కోసం మరో మంచి అవకాశాన్ని అందించేందుకు టెక్ మహీంద్రా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఆధ్వర్యంలో లాజిస్టిక్స్ రంగానికి సంబంధించిన “సప్లై చైన్ మేనేజ్‌మెంట్” మరియు “వేర్‌హౌసింగ్ మేనేజ్‌మెంట్” కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు అకాడమీ కోఆర్డినేటర్ దీప్తి తెలిపారు.
ఈ శిక్షణ ద్వారా యువతకు నైపుణ్యాలు నేర్పడంతో పాటు, శిక్షణ పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నట్టు ఆమె తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులు. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
తరగతులు ఆగస్టు మొదటి వారం నుండి ప్రారంభమవుతాయని, ఇది పూర్తి గది తరగతుల ఆధారంగా నిర్వహించబడుతుందని దీప్తి తెలిపారు. శిక్షణ అనంతరం యువతను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, మద్దతుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఇతర వివరాలు కావలసిన వారు అమీర్‌పేట్ పరిధిలోని ఎర్రగడ్డ రైతుబజార్ ఎదురుగా ఉన్న సెయింట్ థెరిసా చర్చ్ కాంపౌండ్ ఆవరణలో ఉన్న టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ కార్యాలయంను సంప్రదించవచ్చు. అలాగే ఫోన్ నెంబర్ 7337332606కు కాల్ చేయవచ్చని కోఆర్డినేటర్ దీప్తి తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత పూర్తిగా వినియోగించుకోవాలని ఆమె కోరారు.