
పాకిస్థాన్ గూఢచర్యం(Pakistan SPY) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్(Hyderabad)కు చెందిన యూట్యూబర్ బైకర్ భయ్యా సన్నీ యాదవ్(Bhayya Sunny Yadav)ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్టు చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం తలెత్తిన సమయంలోనే హైదరాబాద్‌కు చెందిన భయ్యా సన్నీ యాదవ్ పాకిస్థాన్‌పై తన ద్విచక్ర వాహనంపై టూర్‌కు వెళ్లాడు. అక్కడి లాహోర్, రావల్‌పిండి ప్రాంతాల్లో పర్యటించిన సన్నీ యాదవ్.. భారత్ నుంచి పాక్ వెళ్లిన తొలి భారతీయ బైకర్ తానేనంటూ యూట్యూబ్‌లో పలు వ్లాగ్స్ పోస్ట్ చేశాడు.

భారత్‌కు చెందిన పలువురు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లతో పాటు కొందరు సాధారణ యువతీ యువకులను పాక్ గూఢచారులుగా వాడుకున్న వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర(Jyothi Malhotra)తో మొదలైన కేసులో మరో 12 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఇటీవల పాక్‌కు వెళ్లొచ్చిన సన్నీ యాదవ్‌ను సైతం ఇదే కేసులో విచారించేందుకు చెన్నై ఎయిర్‌పోర్టులో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ టూర్‌కు సంబంధించిన వివరాలతో పాటు అక్కడ ఎవరెవరిని కలిశాడు, ఏయే ప్రాంతాలకు వెళ్లొచ్చాడనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
గతంలో బెట్టింగ్ యాప్(Betting Apps)ల వ్యవహారంలోనూ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నాడంటూ ట్రావెలర్ నా అన్వేషణ అన్వేష్ చేసిన ఆరోపణలతో పాటు, కొందరు బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.