India-Pakistan War: జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. ఉగ్రవాదులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని స్పష్టం చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. ‘ ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తాం. కాశ్మీర్ ఉగ్రవాద చర్యకు గట్టి సమాధానం ఇస్తున్నాం. దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది మోదీ సర్కార్. మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది. పహల్గామ్‌లో అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అని అన్నారు.
వెంటాడి.. వేటాడి చంపుతాం!
