Apple: ఆపిల్ కొత్తగా విడుదల చేసిన iOS 19 ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పటికే టెక్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బీటా వెర్షన్ గా డెవలపర్లకు అందుబాటులో ఉన్న ఈ కొత్త వర్షన్‌లో AI ఆధారిత ఫీచర్లు, మెరుగైన గోప్యతా నియంత్రణలు, కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ తో వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది.
గత నెల రోజులుగా టెక్ ప్రపంచం అమెరికాలో జరుగుతున్న ఆపిల్ డెవలపర్ సమిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సమిట్‌లో ఆ సంస్థ ఎలాంటి ప్రకటనలు చేయనుంది..? ఆపిల్ కొత్త వర్షన్ వస్తుందా..? ఇంకేదైనా కొత్త టెక్నాలజీ ప్రవేశ పెడతారా అని ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేశారంటే ఈ కార్యక్రమం ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఆ అంచనాలను ఏమాత్రం నిరుత్సాహ పరచకుండానే ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ సంచలానత్మక నిర్ణయాలకు తెరదీశారు.
ఈమేరకు గూగుల్, చాట్‌జీపీటీలకు పోటీగా ఆపిల్ ఇంటలిజెన్స్‌ను ప్రకటించిన కుక్.. ఈ సాంకేతికత ద్వారా ఆపిల్ చాట్‌బాట్ సిరిని పూర్తిగా మార్చేశాడు. దీంతో పాటు ఇదే వేధికపై ప్రకటించిన iOS 19 మరో సంచలనం. ప్రస్తుతం ఈ బీటా వెర్షన్ ను మీరు మీ iPhone లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు? అనేది చాలా మంది యూజర్లు ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే మీ కోసం స్టెప్ బై స్టెప్ గైడ్:
పబ్లిక్ బీటా ఇంకా రాలేదు..!
iOS 19 బీటా వెర్షన్ ప్రస్తుతానికి డెవలపర్ బీటాగనే ఉంది. పబ్లిక్ యూజర్ బీటా వర్షన్ ఇంకా విడుదల కాలేదన్న విషయం గమనించాలి. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని ఈ బీటా వర్షన్‌తో లోపాలు తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ బీటా వర్షన్ ప్రధానంగా iPhone 15 సిరీస్, iPhone 14 సిరీస్, iPhone 13 సిరీస్ లకు ఎక్కువగా సపోర్ట్ చేస్తోంది.

iOS 19 బీటా ఇన్‌స్టాలేషన్ స్టెప్స్:
1️⃣ ఆపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ లో నమోదు అవ్వాలి
👉వెబ్‌సైట్: https://developer.apple.com
👉ఏడాదికి ₹8,000 (99$) చెల్లించి డెవలపర్ అకౌంట్ తీసుకోవాలి
2️⃣ మీ iPhone లో Backup తీసుకోవాలి
👉iCloud లేదా Mac లో పూర్తి Backup చేయాలి — బీటా లోపాల వల్ల డేటా కోల్పోయే అవకాశం ఉంటుంది.
3️⃣ Settings → General → Software Update లో Developer Beta ప్రొఫైల్ ఎన్‌రోల్ చేయాలి
👉 Developer.apple.com లో లాగిన్ అయి iOS 19 Developer Beta ను ఎనేబుల్ చేయాలి.
4️⃣ అక్కడే OTA (Over the Air) ద్వారా iOS 19 Beta డౌన్లోడ్ చేయొచ్చు
👉 డౌన్లోడ్ అయిన తర్వాత Install Now క్లిక్ చేయాలి.
5️⃣ ఒకసారి ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఫోన్ రీస్టార్ట్ అవుతుంది
👉 మీకు iOS 19 Beta కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి!
పబ్లిక్ బీటా ఎప్పుడు వస్తుంది?
ఆపిల్ సంస్థ ప్రకటన ప్రకారం జూలై 2025 లో iOS 19 Public Beta విడుదల కానుంది. ఈ బీటా వర్షన్ ఎవరైనా ఉచితంగా ట్రై చేయొచ్చు. దీనికి డెవలపర్ అకౌంట్ అవసరం లేదు. Public Beta కోసం: https://beta.apple.com లింక్ ద్వారా లాగిన్ అవ్వాలి.
👉 కీలక సూచనలు:
✅ ప్రధానంగా ఉపయోగించే iPhone లో బీటా వెర్షన్ ఇన్‌స్టాల్ చేయకండీ
✅ లొపాలు ఉండే అవకాశముంది
✅ Battery drain, App compatibility సమస్యలు రావొచ్చు
✅ Public Beta వచ్చే వరకు వెయిట్ చేస్తే మంచిది
👉 iOS 19 Beta లో కొత్తగా ఏం ఉంది?
✅ AI ఆధారిత Siri
✅ Photo Editing లో కొత్త AI ఫీచర్లు
✅ Lock Screen మెరుగుదల
✅ Privacy Improvements
✅ Performance చాలా వేగంగా ఉంది అన్న ఫీడ్‌బ్యాక్ వస్తోంది.
How to install iOS 19 beta in Telugu, iOS 19 beta download guide Telugu, iOS 19 new features Telugu, Apple iOS 19 Public Beta release date