HHVM: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో ఈ సీన్లు డిలీట్‌!

HHVM Trailer

Share this article

HHVM: ఏపీ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు భారీ అంచ‌నాల న‌డుమ జూలై 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే సెన్సార్‌షిప్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈమేర‌కు సెన్సార్ బోర్డు నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌కు బ‌దులుగా వేరే సీన్లు క‌లిపింది. 162 నిమిషాల పాటు న‌డిచే ఈ సినిమాలో 24 సెక‌న్ల పాటు ఉన్న కొన్ని సీన్ల‌ను తొల‌గించాల‌ని సెన్సార్ బోర్డు కండిష‌న్ పెట్టింది. ఆ స‌న్నివేశాల‌ను తొల‌గించి వాటి స్థానంలో 34 సెక‌న్ల నిడివి ఉన్న సీన్ల‌ను క‌లిపిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈమేర‌కు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం స‌ర్టిఫికేష‌న్‌, హైద‌రాబాద్ రీజ‌న‌ల్ ఆఫీస‌ర్ రాహుల్ గౌలీక‌ర్ అందించిన ఆమోద ప‌త్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

ఏయే సీన్లు డిలీట్ చేశారంటే..?
ఈ చిత్రంలోని పాత్ర‌లు ఎవ‌రినీ ఉద్దేశించిన‌వి కావు అనే టైటిల్ కార్డు వ‌ద్ద వాయిస్ అందించాల‌ని సీబీఎఫ్‌సీ సూచించింది. కులీ కుత‌బ్ షాకు సంబంధించిన కొన్ని విజువ‌ల్స్ అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని తెలిపింది. దేవుళ్ల విగ్ర‌హాల‌ను కూల్చే ఘ‌ట్టం, గుడి త‌లుపుల్ని కాలితే త‌న్నే సీన్ల‌పై సీబీఎఫ్‌సీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. వీటి వ‌ల్ల ప్రేక్ష‌కుల మ‌నోభావాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉండ‌టంతో పాటు మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు దారి తీస్తుంద‌ని కామెంట్ చేసింది. దీన్ని స‌మ‌ర్థించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్ర‌బృందం ఆమేర‌కు వాటి స్థానంలో వేరే సీన్ల‌ను చేర్చి మార్పులు చేప‌ట్టింది.

hhvm

మ‌రో చోట‌, గ‌ర్భ‌వతిగా ఉన్న ఓ మ‌హిళ‌ను నిజాం సైన్యం వేధించే సీన్లు ఇబ్బందిక‌రంగా ఉన్నాయ‌ని సీబీఎఫ్‌సీ తెలిపింది. నిడివి త‌గ్గించ‌డంతో పాటు కొన్నిచోట్ల సీన్ల‌ను బ్ల‌ర్ చేసిన‌ట్లు సమాచారం. మిగ‌తా అన్ని సీన్ల‌కూ సెన్సార్ ఆమోదం ల‌భించింది. దీంతో ఈనెల 24న ఈ ప‌వ‌ర్ ప్యాక్డ్ సినిమా తెర‌పైకి రానుంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *