గ‌ద్ద‌ర్ అవార్డులు వీరికే..!

gaddar award to allu arjun

Share this article

తెలంగాణా ప్ర‌భుత్వం గ‌ద్ద‌ర్ పుర‌స్కారాల‌(Gaddar Awards)ను ప్ర‌క‌టించింది. ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా క‌ల్కి-2898 ఏడీ (Kalki 2898 AD) ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) పేరును ప్ర‌క‌టించింది. ఇదే చిత్రాన్ని ఉత్త‌మ చిత్రంగానూ ఎంపిక చేసింది. ఉత్త‌మ న‌టుడిగా పుష్ప‌-2 (Pushpa-2) సినిమాకు గానూ అల్లు అర్జున్‌, ఉత్త‌మ న‌టిగా 35-చిన్న క‌థ కాదు సినిమాకు గానూ నివేథ థామ‌స్ ఈ పురస్కారం అందుకోనున్నారు. ఉత్త‌మ స‌హాయ‌ ఆక్ట‌ర్‌గా స‌రిపోదా శ‌నివారం నుంచి ఎస్‌జే సూర్య‌, ఉత్త‌మ స‌హాయ‌ న‌టిగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా నుంచి శ‌ర‌ణ్య ప్ర‌దీప్ ను ఎంపిక చేసింది.

గ‌తంలో సినిమా రంగంలో ప్ర‌తిభావంత‌మైన నటులు, నిపుణుల్ని ప్రోత్స‌హించేందుకు స‌ర్కారు నంది అవార్డులు అందించేది. రాష్ట్రంలో ఇదే అత్యున్న‌త పుర‌స్కారంగా ఉండేది. దాదాపు 14 ఏళ్లుగా ఈ సినీ పుర‌స్కారాల‌కు బ్రేక్ ప‌డ‌గా.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఈ అవార్డుల‌ను ప్ర‌ముఖ ఉద్య‌మ గాయకుడు గ‌ద్ద‌ర్ పేరిట ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు గురువారం తొలి పుర‌స్కార జాబితాను తెలంగాణా ఫిలిం డెవ‌ల్‌పెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ దిల్ రాజు(Dil Raju), గ‌ద్ద‌ర్ అవార్డుల క‌మిటీ జ్యూరీ, సినీన‌టి జ‌య‌సుధ‌ విడుద‌ల చేశారు. ప‌లు కీల‌క చిత్రాలు ఈ పుర‌స్కారాల జాబితాలో చోటుద‌క్కించుకున్నాయి.

ఇదీ అవార్డుల జాబితా..

ఉత్త‌మ‌ మూవీ- కల్కి
ఉత్త‌మ‌ సెకండ్ ఫిల్మ్ – పొట్టేలు
ఉత్త‌మ‌ థర్డ్ ఫిల్మ్ – లక్కీ భాస్కర్
ఉత్త‌మ‌ హీరో- అల్లు అర్జున్ (పుష్ప-2)
ఉత్త‌మ‌ డైరెక్టర్- నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్త‌మ‌ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లురీ ( లక్కీ భాస్కర్)
ఉత్త‌మ‌ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్
ఉత్త‌మ‌ సపోర్టింగ్ యాక్టర్ – ఎస్. జె సూర్య (సరిపోదా శనివారం)
ఉత్త‌మ‌ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య
ఉత్త‌మ‌ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్
స్పెషల్ జ్యురీ అవార్డు_ దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్ )
ఉత్త‌మ‌ స్టోరీ రైటర్ _ శివ పాలడుగు
స్పెషల్ జ్యురీ అవార్డు ఫీమేల్ – అనన్య (పొట్టేలు)
ఉత్త‌మ‌ సామాజిక చిత్రం : కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ బాలల చిత్రం : 35 చిన్నకథ కాదు
ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్ : రజాకార్

ఉత్త‌మ‌ నూతన దర్శకుడు : Yadhu వంశీ
హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ : ఆయ్
ఉత్త‌మ‌ సపోర్టింగ్ నటి : అంబాజీపేట ఫేమ్ శరణ్య
ఉత్త‌మ‌ మ్యూజిక్ : భీమ్స్ (రజాకార్)
ఉత్త‌మ‌ సింగర్ : సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
ఉత్త‌మ‌ సింగర్ (ఫీమేల్) : శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
ఉత్త‌మ‌ కమెడియన్స్ : వెన్నెల కిషోర్, సత్య
-ఉత్తమ బాల నటులు : అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
-ఉత్తమ రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్త‌మ‌ స్క్రీన్ ప్లే రైటర్ : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
-ఉత్తమ పాటల రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
-ఉత్త‌మ‌ సినిమాటోగ్రఫర్ : విశ్వనాథ్ రెడ్డి (గామీ)
ఉత్త‌మ‌ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్త‌మ‌ ఆడియోగ్రాఫర్ : అరవింద్ మీనన్ (గామీ)
ఉత్త‌మ‌ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
ఉత్త‌మ‌ ఆర్ట్ డైరెక్టర్ : అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
ఉత్త‌మ‌ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *