Hyderabad: ప్రముఖ ఫోక్ సింగర్, టెలివిజన్ యాంకర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి కలకలం సృష్టించింది. మంగళవారం ఆమె పుట్టినరోజు వేడుకలు చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో జరిగాయి. పక్కా సమాచారంతో రిసార్ట్‌పై దాడి చేసిన పోలీసు అధికారులు భారీగా విదేశీ మద్యం, గంజాయిని పట్టుకున్నట్లు తెలిసింది.
చేవెళ్లలో జరిగిన ఈ పార్టీకి మంగ్లీ పలువురు సినీ ప్రముఖులు, తన సన్నిహితులను ఆహ్వానించింది. ఈ పార్టీలో అతిథులకు విదేశీ మద్యం సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో చేవెళ్ల పోలీసులు రిసార్ట్‌కు చేరుకుని సోదాలు చేయగా.. అక్కడ గంజాయి పొట్లాలు కనిపించాయి. పార్టీలో పాల్గొన్న పలువురికి డ్రగ్స్ పరీక్షలు చేయించగా.. కొంతమందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.
దీంతో చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో నిర్వాహకులతో పాటు గంజాయి సేవించిన పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వేడుకల్లో 48మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పర్మిషన్ లేకుండా ఈవెంట్ నిర్వహించడంపై నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. 1) మంగ్లీ 2) రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, 3) ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్ 4) దామోదర్ రెడ్డి పై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు మంగ్లీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.
అయితే, దీనిపై తెలంగాణ పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది. “అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై దాడిచేసిన చేవెళ్ల పోలీసులు. చట్టాలు పాటించకుండా ఎలాపడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుంది. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారిపట్ల కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడం” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
Drug tests | Singer Mangli News | Ganja in Mangli Birthday Party |