Divorce: లేడీ సూపర్‌స్టార్ నయనతార మరియు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రస్తుతం తమ ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రులుగా బాధ్యతలు నెరవేర్చుకుంటూ కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒకవైపు ఫ్యామిలీ లైఫ్, మరోవైపు వరుస సినిమా ప్రాజెక్టులతో ఇద్దరూ బిజీగా గడుపుతున్నారు. నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినీ ప్రయాణం మధ్య ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి వార్తలకెక్కింది.
ఇటీవల నయనతార భర్త, పిల్లలతో కలిసి విదేశాల్లో హాలీడే ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులు వాటిని విపరీతంగా షేర్ చేశారు. అంతేకాకుండా, రెండు రోజులుగా ఆమె దంపతులు కలిసి పలు ఆలయాలు సందర్శిస్తూ భక్తి పరవశంలో కనిపించారు. ఇటీవలే తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు.

అయితే ఇదంతా జరుగుతున్న తరుణంలోనే, నయనతార పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం టోటల్ ఇండియన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “Marriage is a mistake when you get married to a stupid guy. You do not have to take responsibility of your husband’s actions because men generally won’t grow up. Better leave me TF alone. I’m so done.” అనే అర్థం వచ్చేలా ఓ స్టోరీను ఆమె షేర్ చేసి, కొద్ది క్షణాల్లోనే తొలిగించింది. దీని తెలుగులో అర్థం – “తెలివితక్కువ వారిని పెళ్లి చేసుకోవడం మన తప్పు. వారు చేసే పనులకు మనం బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. మగవాళ్లు ఎప్పుడూ మారరు. నేను ఇక ఇదంతా భరించలేను. దయచేసి నన్ను వదిలేయండి.” అంటూ భావించగలిగేలా ఉంది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో, నయనతార-విఘ్నేష్ మధ్య విభేదాలు జరుగుతున్నాయనే ఊహాగానాలు మిన్నంటాయి. కొంతమంది ఇది నయనతార స్వయంగా చేసిన పోస్ట్ అని నమ్ముతుండగా, మరికొందరేమో ఇది ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. నయనతార ఎవరినైనా ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా ఏదైనా వ్యక్తిగత అనుభవమా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

ముఖ్యంగా, ఈ వివాదాస్పద స్టోరీ పోస్ట్ చేసిన అదే రోజున నయనతార-విఘ్నేష్ దంపతులు కలిసి మురుగన్ ఆలయాన్ని దర్శించడం మరింత చర్చకు దారి తీసింది. ఈ వార్తలపై ఇప్పటివరకు నయనతార గానీ, విఘ్నేష్ శివన్ గానీ ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో అభిమానుల్లో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి.
వాస్తవానికి నయనతార గతంలోనూ ధనుష్‌తో ఓ వీడియో వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచిన సందర్భం ఉంది. ఇప్పుడు తాజా స్టోరీ పోస్ట్ వలన ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి మీడియాలో దుమారం రేపుతోంది. ఈ వార్తలపై నయనతార లేదా విఘ్నేష్ శివన్ అధికారికంగా స్పందిస్తే తప్ప, ఈ వ్యవహారంపై స్పష్టత రాదు. అప్పటి దాకా మాత్రం ఈ జంట చుట్టూ గాసిప్స్, ఊహాగానాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.