Congress: ఏళ్లుగా పీడిస్తున్న నీటి సమస్యకు మోక్షం కల్పిస్తున్నారు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తన నియోజవకర్గం ధర్మపురి పరిధిలోని పలు మండలాల్లో నీటి కటకట స్థానికులను వేధిస్తోంది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం దక్కలేదు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన దృష్టికి వచ్చిన ఒక్కో సమస్యకు ఎమ్మెల్యేగా గెలిచిన వారం నుంచే పరిష్కారం చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగలు సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. అడిగిందే తడవుగా అభివృద్ధి పనులు ముమ్మరం చేయిస్తున్నారు. ఇప్పుడు ధర్మపురి నియోజవకర్గ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇతర అభివృద్ధి పనులతో తనదైన మార్కును చూపిస్తున్న అడ్లూరి.. ఇప్పుడు అన్ని ఊళ్లలో నీటి కటకటకు చెక్ పెడుతున్నారు.

బుగ్గారం బస్టాండు కేంద్రంలో తన సొంత నిధులతో బోరు వేపించగా.. గోపులాపూర్ మాల్గాని మల్లన్న గుడి వద్ద, బుగ్గారం ఎస్సీ కాలనీ, మెయిన్ రోడ్డు, శెకల్ల ఒడ్డెర కాలనీ, బుగ్గారంలోని పోచమ్మ వాడ, వెల్గొండ స్మశాన సమీపంలో, గొల్లపెల్లి మండల కేంద్రంలోని రామాలయం వద్ద, గోపులాపూర్ గ్రామ కేంద్రంలో, మద్దునూర్ గ్రామం ఎస్సీ కాలనీలో.. ఇలా ఒకటా రెండా దాదాపు పదికి పైగా ప్రాంతాల్లో తన సొంత నిధులతో ఇలా అడగ్గానే అలా బోర్లు వేయిస్తూ వచ్చారు. కేవలం గత వారంలోనే ఐదు ప్రాంతాల్లో బోర్లు వేయించి అక్కడి స్థానికులకు నీటి సమస్య తీర్చారు. తాజాగా సోమవారం బుగ్గారం మండల కేంద్రం లో గౌడ సంఘం వినతి మేరకు తాళ్ల మండవ బోరు వేయించిన మంత్రి.. బుధవారం యశ్వంతరావుపేట, గంగాపూర్ గ్రామాల్లో బోర్లు వేయించారు. ఈ సందర్భంగా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ కొబ్బరికాయ కొట్టి బోర్లను ప్రారంభించారు.

మంత్రి ఆదేశాలతో.. బుగ్గారం మండలవ్యాప్తంగా ఏళ్లుగా ఉన్న నీటి సమస్యను స్థానిక నాయకులు దగ్గరుండి తీరుస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల ప్రజలు, అక్కడి స్థానికులు మంత్రి అడ్లూరికి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సిరికొండ మాజీ సర్పంచ్ గాలిపెల్లి రాయమల్లు,యశ్వంతరావుపేట్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఉరుమట్ల సంతోష్, గంగాపూర్ గ్రామ అధ్యక్షులు అడ్డగట్ల సుభాష్, రెంటం శ్రీధర్, బండారి మహేష్, గుర్రపు తిరుపతి, కమ్మరి గంగన్న, గోలి రాజన్న, శిరవేణి పెద్ద నరసయ్య, మామిడాల శ్రీనివాస్, గుర్రపు రమేష్, గోళం రాజేందర్,దాసరి శంకరయ్య, సాకలి ప్రకాష్, గోలి తిరుపతి, కట్ట శ్రీనివాస్,చిన్న కట్ట తిరుపతి, కట్ట గంగారెడ్డి, ఓరుపుల లచ్చన్న, గరిస దుబ్బరాజం,ఓడ్డేపల్లి గంగన్న తదితరులు పాల్గొన్నారు.