Cinema: సినిమా పరిశ్రమలో త్రిష (Trisha), విజయ్ (Vijay) మధ్య ప్రత్యేకమైన స్నేహం గురించి చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయి. చాలాసార్లు ఈ రూమర్స్ తెరమీదికి వచ్చినా, త్రిష ప్రతిసారి వాటిని ఖండించడమే కానీ ఈ వార్తలు ఆగడం లేదు. దీనికి కారణం త్రిష వదిలే సంకేతాలే అని నెటిజన్ల అభిప్రాయం. అయితే, ఈ ఇద్దరి బంధంపై జరుగుతున్న వివిధ ప్రచారాలకు బలం చేకూర్చుతూ త్రిష పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు మరోసారి రచ్చరేపుతోంది.
ఫారిన్ ట్రిప్‌తో మొదలైన ప్రచారం..
త్రిష, విజయ్ విదేశాల్లో కలిసి దిగిన ఫోటోలు గతేడాది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అప్పట్నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ కోలీవుడ్‌లో పెద్ద చర్చ మొదలైంది. త్రిష ఇవి కేవలం స్నేహం మాత్రమే అని చెప్పినా, నమ్మని వారే ఎక్కువగా ఉన్నారు. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ప్రేమ గాసిప్స్‌కు మరింత ఊతమిచ్చారు.
పుట్టినరోజున స్పెషల్ విష్!
ఈ ఏడాది విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక పోస్టు పెట్టడం, మళ్లీ వార్తల్లోకి ఆమెను తెచ్చింది. “హ్యాపీ బర్త్‌డే బెస్టెస్ట్” అంటూ విజయ్‌తో కలిసి దిగిన ఓ ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు త్రిష. ఆ ఫోటోలో విజయ్, త్రిష కలిసి విజయ్ పెంపుడు కుక్కను ముద్దు చేస్తూ కనిపించారు. ఇది చూస్తే వారిద్దరి మధ్య అద్భుతమైన బంధం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
అంతే కాకుండా, అదే ఫోటోను త్రిష తల్లి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీ జోడించడం విశేషం. దీంతో నెటిజన్లు ఈ బంధాన్ని ప్రేమగా అర్థం చేసుకుంటున్నారు. “త్రిష ఇక ఈ రూమర్‌ను పరోక్షంగా అంగీకరించిందనే కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.”

త్రిష స్పందన – నెటిజన్లను తికమక పెట్టిన సూక్తి
ఈ పరిస్థితుల్లో త్రిష తన ఇన్‌స్టా స్టోరీలో ఓ సూక్తిని పోస్ట్ చేశారు. “పూర్తిగా ప్రేమలో మునిగిపోతే అది కొందరిని తికమక చేస్తుంది.” అని రాసిన త్రిష వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇది నేరుగా ఎవరిపైనా కాకున్నా, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితికి ఇది సమాధానం అనిపిస్తోంది. అయితే కొందరు నెటిజన్లు “ఇలాంటి సూక్తులు కాదు, నేరుగా చెప్పండి మీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గతంలోనూ ప్రచారం..
గతేడాది కూడా త్రిష విజయ్ పుట్టినరోజు సందర్భంగా లిఫ్ట్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడంతో ప్రేమ రూమర్స్ బలంగా చెలరేగాయి. ఆ ఫోటో విజయ్ లియో సినిమా గెటప్‌లో ఉండడం, ఇద్దరూ సినిమా సెట్లో తీసుకున్నదే అయినా, సోషల్ మీడియాలో ప్రేమ గాసిప్స్ ఊపందుకున్నాయి.
అంతే కాక, త్రిష ఇటీవల విజయ్ ది గోట్ సినిమాలో ప్రత్యేక గీతం (ఐటెం సాంగ్) చేయడంతో ఈ ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందనే చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
విజయ్‌పై ప్రత్యేక అభిమానం చూపిస్తున్న త్రిష
త్రిష తరచూ విజయ్ పుట్టినరోజులకు ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఫోటోలు, ప్రత్యేక సందేశాలు పోస్టు చేయడం, విజయ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో కనిపించడం చూస్తుంటే, ఇద్దరి మధ్య బంధం కేవలం స్నేహం మాత్రమేనా? అనే ప్రశ్నలు మరింత ముదురుతున్నాయి. కొంతమంది అభిమానులు మాత్రం “వారిద్దరి మధ్య మంచి స్నేహమే ఉంది, ప్రేమ కాదు” అని నమ్ముతున్నారు.
ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో కూడా పలు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. విజయ్ తాజా సినిమాలపై కూడా త్రిష మంచి ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు.
https://www.instagram.com/p/DLNbEggv526/?utm_source=ig_web_copy_link