అర్జున్ రెడ్డితో సంచలనం, కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో హంగామా, యానిమల్‌తో భారత సినీ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. గత కొంత కాలంగా ఎప్పుడూ సినీ వర్గాల్లో హాట్ టాపికే. ఈ బోల్డ్ డైరెక్టర్ చుట్టూ వివాదాలే కాదు.. తీసే సినిమాలూ అంతే సెన్సేషన్. ఇటీవల దీపికా పదుకొణే రచ్చతో వార్తల్లో నిలిచిన ఈ డైరెక్టర్ గురించి ఇప్పుడు మరో వార్త సినీవర్గాల్లో జోరు ప్రచారమవుతోంది.
ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ (Spirit) అనే భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్న వంగా.. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టేశాడు. శరవేగంగా చిత్రీకరణ జరుగతోంది ఈ సినిమాకి. అదే సమయంలో యానిమల్ పార్క్, అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉన్నాయన్న వార్తలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అయితే… ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకరించుకుంటున్నది మరొక బిగ్ కాంబోపై!
వంగా – రామ్ చరణ్ కాంబో ఫిక్స్..?
తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం… సందీప్ వంగా – రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్టు టాక్. ఇదే బ్యానర్ నుంచి వంగా అర్జున్ రెడ్డి టైమ్‌లో అడ్వాన్స్ తీసుకున్నాడట. ఇప్పుడు ఆ అడ్వాన్స్‌కు ఫలితంగా ఈ ప్రాజెక్ట్ రావొచ్చని ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు.
చరణ్ బిజీ అయినా..
ఇప్పటికే రామ్ చరణ్ – బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో పెద్ది మూవీ చిత్రీకరణ జరుపుకుటోంది. శంకర్‌తో తీసిన గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దీని తర్వాత సుకుమార్ సినిమాతో చరణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పైగా త్రివిక్రమ్ తో ఓ స్క్రిప్ట్ చర్చలు కూడా జరుగుతున్నాయట. అయితే ఈ అన్ని ప్రాజెక్ట్స్ ఆలస్యమైతే మధ్యలో ఉన్న గ్యాప్‌లో వంగా-చరణ్ కాంబో సెటప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

యూవీ ప్రొడక్షన్ – నెవర్ బిఫోర్ స్క్రిప్ట్!
టాక్ ప్రకారం.. యూవీ సంస్థ ఈ కాంబోను “నెవర్ బిఫోర్ – నెవర్ అఫ్టర్” అనే లెవల్లో ప్లాన్ చేస్తోందట. వంగా మార్క్‌కి తగినట్టు చరణ్ క్యారెక్టర్ కూడా పూర్తిగా డిఫరెంట్‌గా, ఇంటెన్స్ షేడ్‌లతో ఉండబోతుందట. మాస్ + మైండ్ గేమ్ థ్రిల్లర్ గానూ రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
హీరోల డేట్స్ కోసం కసరత్తు
ప్రస్తుతం సందీప్ వంగా ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ డేట్స్, ‘యానిమల్ పార్క్’ కోసం రణబీర్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే టైమ్‌లో అల్లు అర్జున్ – అట్లీ మూవీ షూటింగ్ జరుపుకుంటుండటంతో, చరణ్ డేట్స్ లభిస్తే వంగా ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.